నితిన్, వెంకీ అట్లూరి సినిమా టైటిల్ ఇదే

నితిన్, వెంకీ అట్లూరి సినిమా టైటిల్ ఇదే

యంగ్ హీరో నితిన్ దూకుడు మీదున్నాడు. ప్లాప్‌లని పట్టించుకోకుండా వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. రీసెంట్‌గా రెండు సినిమాలను మొదలు పెట్టిన నితిన్ మరో సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ మూవీకి టైటిల్ కూడా అనౌన్స్ చేశాడు. మరి నితిన్ అప్ కమింగ్ మూవీ డైరెక్టర్ ఎవరు.? ఆ సినిమా టైటిల్ ఎంటో చూద్దాం…

దాదాపు సంవ‌త్స‌రం పాటు గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో జోరు పెంచుతున్నాడు. ప్ర‌స్తుతం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో భీష్మ‌ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి సినిమాను ఓ సినిమాని ప్రారంభించాడు. ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్లు నటిస్తున్నారు..తాజాగా త‌న 29వ సినిమాను కూడా ప్ర‌క‌టించాడు ఈ యంగ్ హీరో .

తొలిప్రేమ‌ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు రంగ్ దే అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గివ్ మీ స‌మ్ ల‌వ్‌ అనేది దీనికి ఉప‌శీర్షిక‌. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా కీర్తీ సురేష్ నటిస్తుంది. 2020 వేసవిలో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే కృష్ణచైతన్య దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు నితిన్‌. ఇలా ప్లాప్‌లని పట్టించుకోకుండా వరస సినిమాలు చేస్తున్న బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమాలు ఈ యంగ్ హీరోకు ఎలాంటి రిజల్ట్‌ని ఇస్తాయో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *