పారిపోయిన నీరవ్ మోదీ దొరికాడు!

పారిపోయిన నీరవ్ మోదీ దొరికాడు!

ప్రజల ముందే..ప్రజలు చూస్తూండగానే వేలకోట్లను బహిరంగంగానే ఎత్తుకుపోయిన నీరవ్ మోదీ ఇప్పటిదాకా దొరకలేదు.పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను సాంతం ముంచేసి హాయిగా విదేశాలకు పారిపోయాడు.ఇన్నాళ్లవుతున్నా ప్రభుత్వం అతన్ని పట్టుకోలేకపోయింది.అతను మాత్రం దర్జాగా విదేశాల్లో తన జీవితాన్ని సంతోషంగా గడిపేస్తున్నాడు.

ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను బ్యాంకుల్లో ఉంటాయి.కానీ ఆ బ్యాంక్‌లనే దర్జాగా మోసం చేసి ఉడాయించాడు నీరవ్ మోదీ.లండన్ వీధుల్లో కొత్త అవతారంలో ఒక జర్నలిస్టు కంటపడ్డాడు.తనని గుర్తుపట్టకూడదనేమో గడ్డమూ,మీసాలూ బాగానే పెంచాడు.జర్నలిస్టు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా..అన్నిటికీ నో కామెంట్ అని చెబుతూ అక్కడినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు.జర్నలిస్టు ప్రశ్నల నుంచి జారుకోవడానికి ఒక క్యాబ్ ఎక్కాడు.అయితే..ఆ క్యాబ్ ద్రైవర్ ఎక్కడానికి నిరాకరించడంతో మరో క్యాబ్ ఎక్కి పరారయ్యాడు.ఈ సంఘటనంతా జర్నలిస్టు వీడియో తీయడంతో బయటకు తెలిసింది.

Neerav modi in london

రూ. 15 లక్షల అద్దె ఇంట్లో….

లండన్‌లోని వెస్ట్ ఎండ్ స్ట్రీట్‌లో నీరవ్ మోదీ ఆచూకీ దొరికింది.అతను కనబడిన సమయంలో నీరవ్ మోదీ ధరించిన కోటు విలువ దాదాపు 10,000 పౌండ్లు(అంటే దాదాపు రూ. 7 లక్షలు) ఉంటుందని అంచనా. ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్ దగ్గరలో నెలకు 17 వేల పౌండ్లు(అంటే రూ. 15 లక్షలు) అద్దె కట్టి త్రిబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో నివశిస్తున్నాడని తెలిసింది.పైగా తన నివాసానికి అతి సమీపంలోని సోహోలో మళ్లీ తన వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్టు సమాచారం.తను నివశిస్తున్న ఇంటికి దగ్గరలోనే అతను నిర్వహిస్తున్న వజ్రాల దుకాణం కూడా ఉన్నట్టు తెలిసింది.లండన్‌లో వ్యాపారం ప్రారంభించాలంటే నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి.వేల కోట్లు మోసం చేసి విదేశాలకు పారిపోయిన వ్యక్తికి నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్ ఎలా వచ్చిందనేదే ఇపుడున్న ప్రశ్న.నీరవ్ మోదీకి ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి నీరవ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని ప్రభుత్వ ఉన్నతాధికారులు,ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.లండన్‌లో నివశిస్తున్న నీరవ్ మోదీని అప్పగించాలంటూ భారత్ చేస్తున్నా విజ్ఞప్తిని బ్రిటీష్ ప్రభుత్వం నుంచి స్పందన లేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *