దొంగలించిన వస్తువులను అమ్మలేక దొరికిపోతున్న తాజా దొంగలు

దొంగలించిన వస్తువులను అమ్మలేక దొరికిపోతున్న తాజా దొంగలు

దొంగతనం చేయడం అన్ని కళల్లో ఓ ప్రత్యేక కళ. దొంగతనం చేసిన వస్తువులను వీలైనంత తొందరగా అమ్మేసి సొమ్ము చేసుకుని జల్సా చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో దొంగలకు అస్సలు టైం బాగాలేదేమో…దొంగలించిన సొమ్ముని అమ్మేలోపే దొరికిపోతున్నారు. పోలీసులు మాత్రం శ్రమ లేకుండా దొరికిపోతున్నందుకు హాయిగా ఫీల్ అవుతున్నారు. ఇలా దొంగతనం చేసిన వస్తువులు ఒకసారి అమ్ముడుపోయాక దొంగ దొరికినా లాభం లేకుండా పోతుంది. ఇలా సులభంగా దొరికినందుకు పోలీసులు సంతోషంగా ఉన్నా, దొంగలు మాత్రం ఏంటీ ఖర్మా…అని తలలు పట్టుకుంటున్నారు. ఇలా దొంగతనం చేసి ఆ వస్తువులను అమ్ముకోలేక దొరికిన ఈ తరహా ఉదంతాలు మూడు వెలుగులోకి వచ్చాయి.

35 రోజుల కష్టం…

ఈ ఏడాది సెప్టెంబర్ 4న పాతబస్తీలోని పురానీహవేలీలో ఉన్న హిజ్ ఎగ్జాల్డెడ్ హైనెస్(హెచ్ఈహెచ్) నిజాం మ్యూజియంలో తెల్లవారు జామున భారీ చోరీ జరిగింది. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముబిన్, గౌస్ పాషా అనే ఇద్దరు దొంగలు 35 రోజుల పాటు రెక్కీ నిర్వహించి విజయవంతంగా దొంగతనం చేశారు. స్క్రూడ్రైవర్లు, కటింగ్ ప్లేయర్, మేకులు పీకే పరికరం, తాడు, హాక్సా బ్లేడ్‌ల సాయంతో వెళ్లి అల్మారా పగలగొట్టి బంగారు ఆభరణంతో చేసిన టిఫిన్ బాక్స్, కప్పు సాసర్, స్పూన్ దొంగలించారు. రాజేంద్రనగర్‌లోని ఓ ఫామ్‌హౌస్ దగ్గరలో వీటిని పాతిపెట్టారు.

టిఫిన్‌బాక్స్‌లో బిర్యానీ..స్పూన్‌తో మంచినీళ్లు !

పాతిపెట్టాక వాటి ఫోటోలు తీసుకుని…ఫోటోలను, ఒక స్పూన్‌ను వారివద్దనే ఉంచుకున్నారు. వీటిని తీసుకుని ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో అమ్మడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా కొన్నాళ్లు ప్రయత్నించాక సెప్టెంబర్ 11న టాస్క్‌ఫోర్స్ పోలీసులకు దొరికిపోయారు. వారివద్ద వున్న వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారు టిఫిన్‌బాక్స్‌ను, స్పూన్‌నూ నిజాం నిజంగా వాడాడో లేదో కానీ, గౌస్ మాత్రం టిఫిన్‌బాక్స్‌లో బిర్యానీ తిన్నాడు. మొబిన్ తనవద్ద వున్న స్పూన్‌తో మంచినీళ్లు తాగి సంతృప్తి చెందాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *