హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు

హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో ఎన్ఐఏ సోదాలతో నగరం ఉలిక్కిపడింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో పలుపురి ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాద కోణంలో 8 మంది అనుమానితుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. కింగ్స్‌ కాలనీలో భారీగా పోలీసులు మోహరించారు.

గతంలో పట్టుబడ్డ బాసిత్‌ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలతోనే అనుమానితులను ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మాడ్యుల్‌ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన యువకులు ఢిల్లీలో భారీ విధ్వంసాలకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం​ ముగ్గురు ఐసిస్‌ ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉగ్రదాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం వారు రసాయనాలను, డబ్బులను సమకూర్చుకుంటున్నారు. గతంలోనే.. ఢిల్లీలోని ఆర్‌ఎస్సెస్‌ నాయకుడి హత్యకు కుట్రలు పన్నారని.. ఈమేరకు వారికి ఐసిస్‌ నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది.

ఆర్‌ఎస్సెస్‌ నాయకుడి హత్యకు ఢిల్లీ వెళ్లిన బాసిత్‌, నలుగురు యువకులకు ఏకే 47లను ఐసిస్‌ సమకూర్చింది. ఢిల్లీలో ఆ నలుగురు యువకులను అరెస్ట్‌ చేయడంతో.. ప్లాన్‌ విఫలమైంది. దీంతో బాసిత్‌ హైదరాబాద్‌కు తిరిగొచ్చేశాడు. హైదరాబాద్‌లో బాసిత్‌ పాటు మరో ఇద్దరిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *