పాకిస్తాన్‌లో ఐపీఎల్‌

పాకిస్తాన్‌లో ఐపీఎల్‌
ఐపీఎల్‌తో దాదాపు సంబంధం లేని దేశం పేరు చెప్పమంటే పాకిస్తాన్‌ అని క్షణం ఆలోచించకుండా చెప్పేయొచ్చు. కానీ ఈ వార్త మాత్రం వింతగా ఉంది కదా. ఇదేమీ ఫేక్‌ వార్త కాదు. స్వయానా… ఒక ఇంటర్నేషనల్‌ క్రికటరే ఈ విషయాన్ని చెప్పాడు. రెండు వారాల్లో ఐపీఎల్‌ మొదలవుతుండగా… వాటి వేదికలూ ఖరారైపోయాక ఆ క్రికెటర్‌ చేసిన వ్యాఖ్యతో క్రీడాభిమానులు నవ్వుకుంటున్నారు. ఆ క్రికెటర్‌ను ట్రోల్ చేసేస్తున్నారు.
నోరు జారాడు…
 ఐపీఎల్‌కి ఉండే క్రేజే వేరు. పెద్దపెద్ద సూపర్ స్టార్లు కూడా ఐపీఎల్‌ దెబ్బకు తమ సినిమాలను రిలీజ్‌ చేయడానికి భయపడిపోతారు. ఇండియాలోనే కాకుండా ప్రపంచమంతా ఐపీఎల్‌ కోసం ఎదరుచూస్తూ ఉంటారు. మార్చి 23లో ఐపీఎల్‌ సీజన్‌ 12 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌ తలపడనున్నాయి. అంతా ఖరారైపోయాక… పాక్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్ నోరుజారాడు. వచ్చే ఐపీఎల్‌ పాకిస్తాన్‌లో జరగునుందని మీడియా సమావేశంలో అనేశాడు. నిజానికి అతను పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (పీసీఎల్‌)కి సంబంధించిన విషయం చెప్పబోతూ పొరపాటున ఐపీఎల్ అన్నాడు.
అదీ అసలు విషయం…
నిజానికి పాక్తిస్తాన్ ప్రీమియర్‌ లీగ్ మొత్తం మ్యాచ్‌లూ పాకిస్తాన్‌లోనే జరగవు. కానీ మరుసటి పీసీఎల్‌ లోని అన్నిమ్యాచ్‌లూ అక్కడే జరగనున్నాయి. ఈ విషయం చెప్పడంలోనే ఉమర్‌ తడబడ్డాడు. తన మాటల్లోని పొరపాటును వెంటనే గ్రహించి సరిదిద్దుకుని… ఈ సారి పీసీఎల్‌ టోర్నీ మొత్తం పాకిస్తాన్‌లోనే జరగనుందని చెప్పాడు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *