మరింత సేఫ్టీతో వస్తున్న ఇన్‌స్టాగ్రామ్

మరింత సేఫ్టీతో వస్తున్న ఇన్‌స్టాగ్రామ్

సోషల్ మీడియాలో ఏదైనా పాపులర్ అయిందంటే అది నాణ్యమైనదని నమ్మలేం. చాలామంది తమ ప్రోడక్ట్స్ సేల్ కోసం సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లను నిర్వహిస్తూ నకిలీ  కామెంట్లు, నకిలీ లైక్‌లతో మిగతా వారిని మోసం చేస్తుంటాయి. ఇక ఇలాంటి నకిలీ వ్యవహారాలను ప్రోత్సహించేది లేదని ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది. అదేంటొ తెలుసుకుందాం…

Instagram new security update

మొదట హెచ్చరించి…

నకిలీ కామెంట్లు, నకిలీ లైక్‌లను నియంత్రించదానికి, థర్డ్ పార్టీ సర్వీసులు, కొన్ని యాప్‌లు ప్రచారం కోసం వాడే అకౌంట్లను కనుక్కోడానికి ప్రత్యేక విధానాన్ని తెస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది. ఈ నిభందనలను ఉల్లంఘించే అకౌంట్లకు హెచ్చరికలు పంపి వారి పాస్‌వర్డ్ మార్చుకోమని చెప్పనున్నట్టు సంస్థ చెప్పింది.

ఫాలోయర్స్‌ను పెంచుకోవడానికి…

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి వినియోగదారులు తమ ఉత్పత్తులను కొనే విధంగా కొన్ని సంస్థలు ప్రభావితం చేస్తున్నాయి. నకిలీ అకౌంట్ల ద్వారా కొన్ని సంస్థలకు ప్రచారం కల్పించేవారికి, ఆ అకౌంట్ల ఫాలోయర్స్ సంఖ్యను బట్టి డబ్బులు చెల్లిస్తారు. ఈ పద్ధతిలో ప్రచారం చేయడం చాలా సులభం అని, మార్కెటింగ్ ఏజెన్సీ ‘మీడియా కిజ్’ ఏడాది క్రితం చేసిన ఓ పరిశీలనలో వెల్లడించింది. ఫాలోయర్స్ సంఖ్యను పెంచుకోవడానికి అకౌంట్ ఉన్నవారు వాడే కొన్ని యాప్స్‌ను ఈమధ్యనే తొలగించారు. ఇలాంటి యాప్స్…అకౌంట్ హోల్డర్ లాగిన్ సమాచారాన్ని ఇవ్వాలని అడుగుతాయి. కానీ, తమ లాగిన్ సమాచారం ఇతరులు ఎవరికైనా ఇవ్వడం ఇన్‌స్టాగ్రామ్ నిబంధనలకు విరుద్ధం. అలా చేస్తే, వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఇన్‌స్టాగ్రామ్ చెబుతోంది.

2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను 100కోట్ల డాలర్లకు ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది. ఈటీవల 100 కోట్ల వినియోగదారుల సంఖ్యను కూడా దాటిన ఇన్‌స్టాగ్రామ్ ఫేస్‌బుక్ సోషల్ మీడియా మాధ్యమంగా నిలిచింది.2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను 100కోట్ల డాలర్లకు ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది. ఈటీవల 100 కోట్ల వినియోగదారుల సంఖ్యను కూడా దాటిన ఇన్‌స్టాగ్రామ్ ఫేస్‌బుక్ సోషల్ మీడియా మాధ్యమంగా నిలిచింది.


ఏడాది క్రితం ఫేస్‌బుక్‌ యాజమాన్యంతో వచ్చిన విభేదాల కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌ వ్యవస్థాపకులు తమ పదవులకు రాజీనామా చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *