నిద్రపోయినందుకు డబ్బులు వచ్చాయి..!

నిద్రపోయినందుకు డబ్బులు వచ్చాయి..!
నిద్రపోతే డబ్బులు చెల్లిస్తామంటే మనలో అందరూ సిద్ధంగా ఉంటారు. ఎక్కడైనా పనిచేస్తే డబ్బులు ఇస్తారు. కష్టపడితే డబ్బులు ఇస్తారు. కానీ ఒక వ్యక్తి నిద్రపోతున్నందుకు డబ్బులు చెల్లించారు కొంతమంది. అదెలాగో చెప్తే మీరు కూడా నిద్రపోదామని అనుకుంటున్నారా…? అది అందరికీ వర్తించదులెడి. ఎందుకో చదివి తెలుసుకోండి..
 
కొంతమందికి అత్యుత్సాహం ఎక్కువ ఉంటుంది. ఒక వ్యక్తి నిద్రపోతున్నపుడు అతన్ని లైవ్‌లో చూడ్డానికి డబ్బులు చెల్లించారు నెటిజన్లు. ‘ట్విఛ్ అనే గేమింగ్ సైట్ కొత్తరకం వినోదాన్ని అందిస్తూంటుంది. అలా గేమర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇందులో గేం ఆడే వ్యక్తులు లైవ్‌లో చూసే అవకాశం కూడా కల్పించింది. జేస్సీ డీ స్ట్రీంస్ అనే యూజర్ ఈ వెబ్‌సైట్‌లో గేమ్స్ ఆడుతూంటాడు. ‘జస్ట్ చాటింగ్’ అనే కేటగిరీలో ఉన్న జెస్సీ..ఎప్పుడూ ఎడొకటి తినడం చేస్తూ ఉంటాడు. లేకపోతే టీవీ చూస్తూ ఉంటాడు. ఎప్పుడూ చాటింగ్ చేసేపుడు యాక్టివ్‌గా ఉండడు.
 
ఒకరోజు ఇలాగే లైవ్‌లో గేం ఆడుతూ అలాగే నిద్రపోయాడు. అలా రెండు గంటలసేపు లైవ్‌లోనే ఉన్నాడు. ఇది చూసిన నెటిజన్లు అతని నిద్రను చూసేందుకు ఆసక్తి చూపించారు. దానికోసం డబ్బులు కూడా చెల్లించారు. హాయిగా గురక పెడుతూ నిద్రపోతున్న జెస్సీ డీ..మేలుకుని చూసుకుంటే దాదాపు 200 మందికి పైగా వ్యూయర్లు అతని నిద్రను చూడ్డానికి డబ్బులు చెల్లించి ఉన్నారు. ఇది చూసిన జెస్సీ ఆశ్చర్యపోయి…వావ్ ఏంటిదీ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యాడు. ఇప్పటిదాకా అతని వీడియోను 26 లక్షల మంది చూశారు. నిజానికి ‘ట్విఛ్ నిబంధనల ప్రకారం లైవ్‌లో గేం ఆడుతూ నిద్రపోకూడదు. అయితే అతను నిద్రపోతున్న సమయంలో వ్యూయర్లు డబ్బులు చెల్లించారు కాబట్టి అతనికి ఎలాంటి ఫైన్ పడకపోవడం విశేషం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *