నెల్లూరులో తెరవెనుక 'వెన్నుపోటు' పాలిటిక్స్‌

నెల్లూరులో తెరవెనుక 'వెన్నుపోటు' పాలిటిక్స్‌

అర్బన్‌లో ప్రత్యర్థికి ఓటేయండి. నారాయణను ఓడించండి. రూరల్‌లో మాత్రం మనోడినే గెలిపించాలి. గెలిచాక, వైసీపీలోకి వెళ్లిపోతారు. ఇక, గెలవని జనసేనకు ఎందుకు ఓటు వేస్తున్నారు. ఈ మాటలన్నది ఎవరో కాదు. నారాయణ ఓటమికి స్కెచ్ గీసిన, టీడీపీ నాయకురాలి ఆడియో సంభాషణ. సోషల్ మీడియాలో ఆడియో చక్కర్లు కొడుతోంది. సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడవడం, తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారట.

నెల్లూరు జిల్లా టీడీపీలో లుకలుకలు బయట పడాయి. నెల్లూరు సిటీలో నారాయణ తరపున ప్రచారం చేస్తూనే, ఆయనను ఓడించాలంటూ ఆ పార్టీ నాయకురాలు ఒకరు కార్యకర్తలకు సూచించిన విషయం బయటకు పొక్కింది. మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ కుమార్తె తారక..నారాయణ తరపున ప్రచారం చేస్తూనే, ఆయన్ను ఓడించాలని కార్యకర్తలకు సూచించారు. నెల్లూరు సిటీలో వైసీపీ అభ్యర్థి అనిల్‌ను గెలిపించాలంటూ, ఆమె కార్యకర్తలతో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఒకటి లీకైంది. సొంత పార్టీ నాయకురాలే తెరవెనుక వెన్నుపోటు పాలిటిక్స్ నడపడం, పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా నారాయణ వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తోందట. నెల్లూరు అర్బన్‌లో టీడీపీ నుంచి నారాయణ పోటీ చేయగా, వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ బరిలో దిగారు. పార్టీలో ఉంటూ ప్రతిపక్షానికి మద్దతు తెలిపిన తారకపై అధిష్ఠానం ఆగ్రహంతో ఉందట.

నెల్లూరు రూరల్ లో టీడీపీ అభ్యర్థి అజీజ్‌ను గెలిపించాలని తారక కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతేకాదు, అజీజ్‌ గెలిస్తే వైసీపీలోకి వెళ్లిపోతాడంటూ ఆమె చేసిన కామెంట్స్‌ టీడీపీలో కలకలం రేపుతోంది. నెల్లూరు రూరల్‌లో శ్రీధర్‌ రెడ్డి డ్రామాలను అనిల్ వర్గం తట్టుకోలేకపోతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇటు వైసీపీని కూడా ఇరకాటంలో పడేశాయి. శ్రీధర్ రెడ్డి పట్ల అనిల్ వర్గం యాంటీగా ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఆమె వ్యాఖ్యలను బట్టి నెల్లూరులో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది.

మొత్తంగా, సొంత పార్టీ వాళ్లే తలనొప్పిగా మారడం, మంత్రి నారాయణను తీవ్రంగా కలచివేస్తుందట. ఇదిలా ఉంటే, నెల్లూరు సిటీలో తమ గెలుపు ఖాయమన్న ధీమాతో అనిల్ వర్గం ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *