మురుగదాస్ పై సంచలన కామెంట్స్ చేసిన నయనతార

మురుగదాస్ పై సంచలన కామెంట్స్ చేసిన నయనతార

కోలీవుడ్ టాప్ హీరోయిన్ గా కెరీర్ ని ఎంజాయ్ చేస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార… తను చేసిన ఒక హిట్ సినిమా గురించి కామెంట్ చేస్తూ, తన కెరీర్ లోనే అదో చెత్త నిర్ణయం అంటూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు, ఒక స్టార్ హీరో అభిమానులకి కూడా షాక్ ఇచ్చింది… ఇంతకీ ఆ హీరో ఎవరు? నయన్ ఏ సినిమా గురించి రిగ్రెట్ అయ్యిందో చూడండి…

కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న లేడీ సూపర్ స్టార్ నయనతార, కెరీర్ స్టార్టింగ్ లో గ్లామర్ డాల్ గానే కనిపించింది. ముఖ్యంగా నయన్ మొదటి సినిమా చంద్రముఖితోనే మెప్పించిన నయన్, ఆ తర్వాత మురుగదాస్ దర్శకతవరంలో గజినీ మూవీ చేసింది. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా దర్శకుడితో పాటు, హీరోకి మంచి పేరు తెచ్చిపెటింది కానీ నయన్ కి మాత్రం గ్లామర్ డాల్ అనే ముద్రపడేలా చేసింది. అందుకే ఘజిని సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కూడా ఆ మూవీలో నటించడమేంది, తన కెరీర్ లోనే తీసుకున్న చెత్త నిర్ణయం అంటూ కామెంట్ చేసింది. మురుగదాస్‌ తనని సంప్రదించినప్పుడు చెప్పిన కథ వేరు, ఆ తర్వాత తెరమీద చూపించింది వేరు’ అని నయనతార కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది.

కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ కామెంట్స్ విన్న సూర్య ఫ్యాన్స్ తో పాటు మురుగదాస్ అభిమానులు కూడా చాలా కోపంగా ఉన్నారు. సోషల్ మీడియా పుణ్యమాని ఈ కాంట్రవర్సి ఎంత వరకూ వెళ్తుందో తెలియదు కానీ నయన్ మాత్రం ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలోనే నటిస్తోంది. రజినీకాంత్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న సినిమాలో నయనతారనే హీరోయిన్, ఇప్పుడు నయన్ చేసిన ఆ కామెంట్స్ దర్బార్ సినిమాపై ఎంత వరకూ ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *