ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని

నానితో సినిమా తీస్తే నిర్మాతలు సేఫ్ జోన్లో పడతారు. అందుకే ఈ యంగ్ టాలెంట్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు, దర్శకులు క్యూలో ఉంటారు. ఆ మధ్య దేవదాసుతో యావరేజ్ హిట్ అందుకున్న నాని జెర్సీ మూవీతో ఏప్రిల్ 19న ప్రేక్షకు ముందుకు రాబోతున్నాడు.అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు నాని. ఇప్పుడు విక్ర‌మ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ లీడ‌ర్‌ చేస్తున్న ఈ హీరో ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ‌ దర్శకత్వంలో మరో సినిమాను చేయబోతున్నాడు.

ఇటీవలే కలిసి నానికి స్టోరీ కూడా వినిపించడట దర్శకుడు.ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇంతకుముందు ఈ కాంబినేషన్‌లో వచ్చిన అష్టాచెమ్మా, జెంటిల్‌మెన్ సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో ఈ సినిమా పై కూడా మంచి అంచనాలనే ఉన్నాయి. ఇందులో నానికి జోడీగా అదితిరావు హైద‌రిని సెలక్ట్ చేశారని తెలుస్తోంది.. సుధీర్‌బాబు కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నాడ‌ట‌. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజిగా ఉన్న ఇంద్ర‌గంటి త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు. మరి ఈ సినిమాలో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *