ఛాలెంజింగ్ రోల్‌లో సాయి పల్లవి

ఛాలెంజింగ్ రోల్‌లో సాయి పల్లవి

అందం, గ్లామ‌ర్ వంటి వాటితో ప‌ని లేకుండా యూత్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది సాయిప‌ల్ల‌వి. యాక్టింగ్‌తో, అదిరిపోయే డ్యాన్సింగ్ స్కిల్స్‌తో సౌత్‌లో వీరాభిమానుల‌ను సంపాదించ‌కుంది. త‌మిళ‌, మ‌ల‌యాళ‌, తెలుగు ఇండస్ట్రీల్లో వరస సినిమాలు చేస్తు బిజీ బిజీగా ఉంది. ఓ సినిమాలో సాయి పల్లవి ఫిక్సయిందంటే… ఎలాంటి క్యారెక్టర్ అయినా ఈజీగా చేస్తుందనే ఇమేజ్ ఉంది. అంతేకాదు సాయి పల్లవి స్టెప్పులేసిందంటే చూస్తూ కూర్చోవాల్సిందే అనే అభిప్రాయం కూడా ఉంది. అటు నటిగా.. ఇటు డ్యాన్సర్ గా ఇప్పటివరకు 100% ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయిన సాయిపల్లవి..ఇప్పుడు రానాతో కలిసి నటిస్తున్న విరాటపర్వంలో ఓ ఛాలెంజిగ్ పాత్రలో నటించబోతుందట.

1980 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న విరాట పర్వం లో సాయిపల్లవిడే కీలక పాత్ర అని తెలుస్తోంది. ఈ మూవీలో రెగ్యులర్ లుక్ లో కాకుండా డీ గ్లామరైజ్ క్యారెక్టర్ లో నటించబోతుందట.. ఓ రకంగా చెప్పాలంటే ఏ స్థాయి నటి అయినా ఇది చాలెంజింగ్ రోలే అలాంటిది ఈ క్యారెక్టర్ సాయి పల్లవికి వరించింది.మరోపక్క శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నాగచైతన్యతో కలిసి నటింబోతున్న సినిమాలో డ్యాన్సర్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది… అయితే ఇప్పటి వరకు సాయి పల్లవి చేసిన సినిమాల్లో వేసిన స్టెప్పులు వేరు.. ఇప్పుడు ఈ సినిమాలో ఫుల్ టైమ్ డ్యాన్సర్ గా నటించడం వేరు.సాయిపల్లవికి ఇది అసలు సిసలైన పరీక్ష అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నా ఈ బ్యూటీ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. తనకు పాత్ర నచ్చితేనే ఏరి కోరి మరీ సినిమాలను సెలక్ట్ చేసుకునే ఈ బ్యూటీ వరస చూస్తుంటే ఈ పరీక్షలో కూడా ఈజీగా నెగ్గుతుందనే అనిపిస్తుంది. చూడాలి మరి ఫ్యాన్స్ నమ్మకాని ఎంతకు నిలబెడుతుందో చూడాలి…

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *