ప్లాప్ టాక్ తెచ్చుకున్న నర్తనశాల

ప్లాప్ టాక్ తెచ్చుకున్న  నర్తనశాల

రోమాంటిక్ ఎంటర్ టైనర్ ఛలో మూవీ కమర్షియల్ హిట్ అందుకున్న నాగాశౌర్య తాజాగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చేసిన సినిమా నర్తనశాల. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కళామందిర్‌ కల్యాణ్ ఓ కూతుర్ని కని తన తండ్రి చేతిలో పెట్టాలని కలలు కంటుంటాడు.దాంతో చనిపోయిన తన భార్య మనవరాలిగా తిరిగి తన ఇంట్లోనే పుడుతుందన్న నమ్మకంతో ఉంటాడు కల్యాణ్ తండ్రి . కానీ కల్యాణ్ భార్య మగ బిడ్డకు జన్మనిస్తుంది. ఈ విషయం తెలిస్తే తండ్రి గుండె ఆగిపోతుందని కొడుకును కూతురిలాగే పెంచి పెద్ద చేస్తుంటాడు.పెరిగి పెద్దవాడైన కల్యాణ్ కొడుకు అదేనండి మన హీరో ఆడపిల్లకు ఏ సమస్య వచ్చినా తానే ముందుండి పరిష్కరిస్తుంటాడు. అలా ఓ సమస్య నుంచి మానస అనే అమ్మాయిని రక్షించి ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ కొన్ని కారణల వల్ల దందాలు చేసే జయప్రకాష్ రెడ్డి కూతురు సత్య ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి నాగశౌర్య ఎలా బయటపడ్డాడు.? నాగశౌర్య కు గే లా నటించాల్సి అవసరం ఎందుకు వచ్చింది. అన్నదే మిగతా కథ.

అంచనాలను అందుకొలేకపోయిన మూవీ

ఛలో సినిమాతో సూపర్‌ హిట్‌ సాధించిన నాగశౌర్య అదే కాన్ఫిడెన్స్‌ తో మరోసారి తన సొంత నిర్మాణ సంస్థలో నర్తనశాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోయిజంతో పాటు గే కామెడీ కూడా బాగానే పండించాడు.హీరోయిన్లుగా నటించిన కశ్మీర, యామినీ భాస్కర్‌లు నటన పరంగా పెద్దగా మెప్పించలేకపోయినా.. గ్లామర్‌ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మిగత క్యారెక్టర్స్ తమ పరిధిమేరకు నటించారు.

Narthana sala Collection report

ఈ మధ్య కొత్త దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. దీంతో ఈ సినిమా దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి కూడా డెబ్యూ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకుంటాడు అనుకుంటే సింపులు కథతో సినిమాను తెరకెక్కించాడు. ఫస్ట్‌హాఫ్‌లో హీరో హీరోయిన్ల లవ్‌ స్టోరి.. కొన్ని కామెడీ సీన్స్‌ ఆకట్టుకున్నా సెకండాఫ్ లో మాత్రం ప్రేక్షకుల సహానానికి పరిక్ష పెట్టాడు.

తేడా కొట్టింది

ఛలో ఇచ్చిన కన్ఫిడెంట్‌తో ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు నాగాశౌర్య. అయితే ఈ యంగ్ హీరో అంచనాలను తలకిందులు చేసింది నర్తనశాల. లవ్ అండ్ ఫ్యామిలి సినిమాలు చేస్తు లవర్ బాయ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసున్న నాగశౌర్య కొత్తగా ట్రై చేసేందుకు గే పాత్రలో నటించిన వర్కౌట్ కాలేదు. టైటిల్ కాస్త డిఫరెంట్ గా ఉండడంతో ఈ సినిమాలో మ్యాటర్ ఉంటుందేమో అని సినిమా వెళ్ళిన నిరాశే మిగిలింది.ఈ సినిమా గురించి ఒకమాటలో చెప్పాలంటే వన్ టైం వాచ్ దిస్ మూవీ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *