దేనికైనా రెడీ : ఎమ్మెల్యే అవ్వాలని బలంగా ఫిక్స్ అయిన నారాయణ

దేనికైనా రెడీ : ఎమ్మెల్యే అవ్వాలని బలంగా ఫిక్స్ అయిన నారాయణ

ఎమ్మెల్యేగా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్న ఆ మంత్రి… తనకు సహకరిస్తే ఏం కావాలన్నా చేసేస్తున్నారట. అసంతృప్తులను బుజ్జగించేందుకు అడిగనవన్నీ ఇస్తున్నారట. కాదనకుండా చేస్తున్నందున తన గెలుపుకు సహకరించాలని కోరుతున్నారట. పదవులు, పనులు ఎరవేస్తున్నారు సరే…ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇస్తే పరిస్థితి ఏంటి ..? ఇంతకీ అడగకుండానే అన్నీ చేసిపెడుతున్న ఆమంత్రి ఎవరు? ఏమా కథ?

నెల్లూరు అర్బన్ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. మంత్రి నారాయణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతుండడంతో అక్కడ రాజకీయ పరిణామాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో ఎమ్మేల్యేగా గెలవాలని భావిస్తున్న నారాయణ, వ్యతిరేక వర్గాన్ని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారట. పదవుల పందేరంతో తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారట. గత ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ద్వారా తొలిసారి బాబు కేబినెట్ లోకి అడుగుపెట్టారు నారాయణ. డైరెక్ట్ గా మంత్రి ఛాన్స్ కొట్టేయడంతో ఇంటా బయట ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దొడ్డి దారిన మంత్రి అయ్యారన్న అపవాదును మూటగట్టుకున్నారు. ఎలాగైనా ఎమ్మెల్యే అయిపోవాలని ఫిక్స్ అయిపోయారో ఏమో, ముఖ్యమంత్రిని ఒప్పించి నెల్లూరు టౌన్ నుండి పోటీకి సిద్ధమయ్యారు. అధినేత గ్రీన్ సిగ్నల్ ఇ్వడంతో గత ఆరు నెలలుగా నెల్లూరు పట్టణంలో పాతుకుపోయారు.

ఇదిలా ఉంటే నెల్లూరు అర్బన్ నుండి మంత్రి నారాయణకు టికెట్ ఓకే అయిందని తెలిసిన దగ్గర నుండి..స్థానిక టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఈనేఫథ్యంలో వ్యతిరేక వర్గాన్ని తనవైపు తిప్పుకోవడానికి నారాయణ నయా ప్లాన్ వేశారు. కాంట్రాక్ట్ లు, నామినేటేడ్ పదవులతో స్థానిక నేతలను బుట్టలో పడేశారని ప్రచారం జరుగుతుంది. ఐతే, ఆయన ఎన్ని కాంట్రాక్టులు, నామినేటెడ్ పదవులు ఇచ్చినా…నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు మాత్రం ఆయనకు దూరంగా ఉంటున్నారట. నాలుగున్నరేళ్లలో పార్టీకి కోసం ఏమీ చేయని నారాయణ..ఇప్పుడు ఎమ్మేల్యేగా గెలవడం కోసం ఇలా కోట్లు కుమ్మరిస్తున్నాడా? అంటూ చెవులు కొరుక్కుంటున్నారట. మరోవైపు, నెల్లూరు అర్బన్ లో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. నారాయణ, చంద్రబాబులే టార్గెట్ గా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

మొత్తంగా ఎమ్మెల్యే అవ్వాలని బలంగా ఫిక్స్ అయిన నారాయణ దేనికైనా రెడీ అంటున్నారట. ఐతే, తనపై గుర్రుగా ఉన్న కొందరు తమ్ముళ్లు చివర్లో హ్యాండిస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళన మంత్రిగారిని వెంటాడుతోందట.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *