నన్ను దోచుకుందువటే మూవీ రివ్యూ

నన్ను దోచుకుందువటే మూవీ రివ్యూ

సమ్మోహనం’ లాంటి క్లాసికల్ హిట్ తర్వాత హీరో సుధీర్‌బాబు చేసిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఈ చిత్రంతో ఆయన నిర్మాతగా కూడా మారారు. కన్నడ భామ నభా నతేష్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. నాజర్, తులసి, వేణు ముఖ్య పాత్రల్లో నటించారు. కొత్త దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు ఈ చిత్రానికి దర్శకుడు.సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందజేశాడు. ఈ సినిమా ఈ రోజు విడుదలైంది…

Nannu Dochukunduvate review

తనకు కెరీరే ముఖ్యం…

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన కార్తీక్ హాస్టల్లో ఉండి చదువుకుంటూ తండ్రి ప్రేమకు దూరం అవుతాడు. పెద్దయ్యాక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తూ అమెరికా వెళ్లడమే లక్ష్యంగా కష్టపడుతుంటాడు. అలాంటి కార్తీక్‌ తన మరదలి సమస్యను పరిష్కరించడం కోసం సిరి అనే కొలీగ్ పాత్రను కల్పించి, తనను ప్రేమిస్తున్నానని తండ్రికి అబద్ధం చెబుతాడు. దీంతో షార్ట్ ఫిల్మ్‌లలో నటించే మేఘన, కార్తీక్ జీవితంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు.

మేఘన తన ప్రేమను వ్యక్తం చేసేలోగా ఆఫీస్ సమస్యల కారణంగా.. తనకు కెరీరే ముఖ్యం, ఇకపై కలవడం కుదరదని కార్తీక్ ఆమెతో చెప్పేస్తాడు. తర్వాత కొన్ని సంఘటనల రీత్యా ఆమె సిరిగా మళ్లీ కార్తీక్ కుటంబానికి దగ్గరవుతుంది. కార్తీక్ తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నా మేఘనకు చెప్పలేకపోతాడు. చివరకు కార్తీక్ తను కలగన్నట్టుగానే అమెరికా వెళ్లిపోయాడా? లేదంటే మేఘన ప్రేమను పొందాడా? లేదా? అనేది ఈ సినిమా కథ.

Nannu Dochukunduvate movie review

కామెడీ ట్రాక్ సూపర్ …

first half తో compare చేస్తే సెకండాఫ్ కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది, మొదటిభాగంలో కామెడీ బాగా పండింది, వైవా హర్ష మరియు ఇతర షార్ట్ ఫిలిం మేకర్స్ తో వచ్చే కామెడీ ట్రాక్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అనిపించినా కూడా  క్లైమాక్స్లో వచ్చే తండ్రి కొడుకుల ఎమోషన్ సీన్ బాగా వర్కౌట్ అయింది. సుదీర్ బాబు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అలాగే తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఎస్ నాయుడు, కథ నీ హ్యాండిల్ చేసిన విధానం కూడా బాగుంది. బొమ్మరిల్లు తర్వాత తెలుగు తెరపై కనిపించని అలాంటి బబ్లీ క్యారెక్టర్ ఈ సినిమాలో నబా నటిశ్ ద్వారా చూడవచ్చు. తన క్యారెక్టర్ కి చాలా న్యాయం చేసింది. తండ్రి పాత్రలో నాజర్, మరదలి పాత్రలో వర్షిని తమ పాత్రలకు న్యాయం చేశారు. కార్తీక్  కనిపించిన సుధీర్ బాబు, తన క్యారెక్టర్ లోని ప్రతి ఎమోషన్ ని స్క్రీన్ పై బాగా చూపించాడు, చాలా మెచ్యూర్డ్ యాక్టర్ లా కనిపించాడు. అర్జున్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. మొత్తానికి నన్ను దోచుకుందువటే ఫ్యామిలీ, లవ్, కామెడీ అన్నీ ఉన్న ఒక మంచి సినిమాగా నిలిచింది…

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *