ఇస్మార్ట్ శంకర్‌లో నన్ను దోచుకుందువటే హీరోయిన్‌

ఇస్మార్ట్ శంకర్‌లో నన్ను దోచుకుందువటే హీరోయిన్‌
నన్ను దోచుకుందువటే మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన  బ్యూటీ నభా నటేష్. ఈ సినిమాలో అల్లరి అమ్మాయిల నటించి కుర్రకారు మనసు దోచుకుంది. యాక్టింగ్‌తో పాటు అందంతోనూ అందరిని అట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీకి  ఫస్ట్ సినిమాతోనే  అల్లరి పిల్లగా పరిచయం అవ్వడంతో బాగా కలిసోచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన  వెంటనే టాలీవుడ్‌లో నభా నటేష్‌కు వరస పెట్టి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో డిస్కోరాజా సినిమాలలో నటించే ఛాన్స్ అందుకుంది.
 
Nabha Natesh in iSmart Shankar

ఫోటోషూట్లతో

ఇక ఈ బ్యూటీ క్యూట్ లుక్స్‌కు  పూరి జగన్నాథ్ , హీరో రామ్ స్మార్ట్‌గా ప్లాట్ అయ్యారట. అందుకే ఈ కాంబోలో రాబోతున్న మాస్  ఎంటర్‌టైనర్ ఇస్మార్ట్ శంకర్‌లో ఈ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చారు.. దీంతో అమ్మడి ఆనందానికి అవధులే లేకుండా పోయాయ్. ఈ సినిమాలతో తనేంటో మరోసారి నిరూపించుకోవాలని చూస్తుంది. ఎనర్జిటిక్ రామ్ సరసన ఛాన్స్ అంటే అంతే ఎనర్జిటిక్ గా ట్రాన్స్ ఫామ్ అయిపోవాలని భావించిందో ఏమో.. నభా ఫోటోషూట్లతో  యూత్‌ని మత్తులోకి దించేస్తుంది. ఈ ఫోటోషూట్లను తెగ వైరల్  అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది దర్శకనిర్మాతల చూపు నభాపై పడిందని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌ , డిస్కోరాజా సినిమాలతో పాటు మరో రెండు సినిమాలకు కూడా సంతకాలు చేసిందట. ఇదే రైట్ టైం అనుకుంటున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అందుకోవడం కోసం వ్యూహాలు రచిస్తోంది. మరి  అమ్మడి  ప్రణాళికలు  ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *