ఆ హిట్ మూవీ సీక్వెల్ కి నిర్మాతగా హీరో నాని…!

ఆ హిట్ మూవీ సీక్వెల్ కి నిర్మాతగా హీరో నాని…!

హీరోగా సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్తున్న నాని స్పీడ్‌కు ఆ మథ్య కాస్త బ్రేక్ పడినా… మళ్లీ స్పీడ్ పెంచి వరస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ సారి రెగ్యులర్‌ పార్మాట్‌ని పక్కన పెట్టి కొత్త కంటెంట్స్‌తో సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు ఎప్పుడు రోటిన్‌కు భిన్నంగా ఆలోచించే నాని అ! సినిమాతో నిర్మాతగా మారి మంచి సక్సెసే అందున్నాడు. ఇప్పుడు మరో సినిమాని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడట.నానికి కథ నచ్చాలేగాని తనే హీరోగా, లేకపోతే మరో హీరోతోగాని సినిమాని నిర్మించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ దర్శకుడు స్వ‌రూప్‌తో ఓ హిట్ మూవీకి సీక్వెల్‌ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌ సూపర్ హిట్‌గా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఎవరు ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ డిటెక్టివ్ మూవీ నానికి తెగ నచ్చేసిందట. దీంతో ఈ చిత్ర దర్శకుడు స్వ‌రూప్‌తో క‌ల‌సి వక్క్ చేయాలని ఫిక్స‌య్యాడట. ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దర్శకుడు ఇటీవలే నానికి కథని వినించాడట. స్టోరీకి కనెక్ట్ అయిన నాని వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఈ సినిమాలో న‌వీన్ పొలిశెట్టితో పాటు మరో హీరో కూడా నటించబోతున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ త్వరలోనే చేయబోతున్నారట.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *