కెరీర్‌ని రిస్క్‌లో పడేసుకుంటున్నా నాని

కెరీర్‌ని రిస్క్‌లో పడేసుకుంటున్నా నాని

బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో దూకుసుకుపోతున్నా యంగ్ హీరో నానికి ఆ మధ్య వచ్చిన కృష్ణార్జున యుద్దం,దేవదాస్ సినిమాలు అప్సేట్ చేయడంతో రెగ్యులర్ ఫార్మెట్‌ని పక్కాన పెట్టి ఇంకాస్త విభిన్న నేపథ్యంలో స్టోరీస్‌ని సెలక్ట్ చేసుకుంటు సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ క్రమంలోనే డిఫరెంట్‌గా చేస్తున్న చిత్రం జెర్సీ.గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడు ఢిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు నాని.ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో గ్యాంగ్‌ లీడర్‌ సినిమా చేస్తున్నాడు.

nani upcoming releases

ఈ రెండు మూవీస్ తరువాత చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే అనౌన్స్ చేశాడు నాని.తనని హీరోగా ఇంటడ్యూస్‌ చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ విభిన్న నేపథ్యంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ మూవీలో సుధీర్ బాబు కూడా హీరోగా నటిస్తున్నాడట.ఇటీవలే ఇందులో నాని డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నాడని టాక్ వినిపించింది.కానీ ఇప్పుడు ఈ మూవీ సంబంధించి టాలీవుడ్ సర్కీల్‌లో మ‌రో ప్ర‌చారం జ‌రుగుతుంది.సుధీర్‌ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తే ,నాని విలన్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాని సమాచారం..కంప్లీట్‌గా నెగెటివ్‌ రోల్‌ అయినా కథా కథనాలు ,ఆ పాత్ర‌కున్న బ‌లం నచ్చటంతో పాటు ఇంద్రగంటి తన గురువు కాబట్టి తన ఇమేజ్‌ని పక్కన పెట్టి ఏ మాత్రం ఆలోచించకుండా విలన్ రోల్ చేయడానికి నాని ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ చేయబోతున్నారట. మరి ఇప్పటివరకు హీరోగా ఇరగదీసిన నాని విలన్‌గా ఎలాంటి ఫర్మామెన్స్ ఇస్తాడో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *