బాబు పాత్రలో మెప్పించిన రానా

బాబు పాత్రలో మెప్పించిన రానా
నందమూరి తారక రామారావు బయోపిక్ పేరుతో క్రిష్-బాలకృష్ణ తీసిన సినిమా ‘ఎన్టీఆర్’. ఈ బయోపిక్ నుంచి వచ్చిన ఫస్ట్ పార్ట్ కథానాయకుడు ఊహించని విధంగా ఫ్లాప్ అవ్వడంతో పార్ట్ 2 మహానాయకుడు సినిమాని విడుదల చెయ్యడానికి బాగా టైం తీసుకొని కథనంలో మార్పులు చేసిన దర్శక నిర్మాతలు, ఎట్టకేలకు మహానాయకుడు సినిమాని ప్రేక్షకులు ముందుకి తెచ్చారు. మరి భారీ భారాన్ని మోస్తూ ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం. తెలుగులో అత్తా సొమ్ము అల్లుడి దానం, సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అనే సామెతలు వినే ఉంటారు. ఈ సామెతలు మహానాయకుడు సినిమాకి సరిగ్గా సరిపోతాయి. దానికి కారణం పేరుకే ఎన్టీఆర్ బయోపిక్ అని ఉన్నా సినిమా అంతా చంద్రబాబు నాయుడు కనిపించడం. కథాయనకుడు ఎండ్  నుంచి ప్రారంభమైన ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ మొదటిసారి సీఎం అయ్యే వరకు చూపించారు. ఆ తర్వాత అంతా బాబు మయమే కనిపిస్తుంది. అవిశ్వాస తీర్మాన సమయంలో బాబు ఎలా ఆలోచించాడు, ఎమ్మెల్యేలని ఎలా మేనేజ్ చేశాడు. ముఖ్యంగా నాదెండ్ల ద్రోహం చేసిన తర్వాత ఎన్టీఆర్ ఆవేశంతో పనులు చేస్తే చంద్రబాబు నాయుడు మాస్టర్ మైండ్ తో పని చేశాడు అనేది చూపించారు, క్లిష్ట పరిస్థితో బాబు ఎంత తెలివిగా పార్టీని కాపాడుకున్నాడు అనేది క్రిష్, బాలయ్యలు అద్భుతంగా చూపించారు కానీ పాపం ఇది చంద్రబాబు బియోపిక్ కాదు ఎన్టీఆర్ బయోపిక్ అనే విషయం మర్చిపోయి ఉంటారు.
 
NTR Mahanayakudu Review

బాబు పాత్రలో

ఇక కథానాయకుడు ముగింపు నుంచి మొదలైన ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ బాగున్నాడు, బసవతారకమ్మగా విద్యాబాలన్ జీవించింది, కళ్యాణ్ రామ్, సచిన్ కెద్కర్ లు తన పాత్రలకి న్యాయం చేశారు. అయితే బాబు పాత్రలో కనిపించిన రానా మాత్రం సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రానా నటన చాలా బాగుంది. మహాయానాకుడు సినిమాకి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ లాంటి సాంకేతిక అంశాలు బాగా హెల్ప్ అయినా  వీళ్లందరినీ ముందుండి నడిపించాల్సిన కథలోనే దమ్ములేదు, దర్శకత్వంలో పసలేదు, అందరికి తెలిసిన కథే అయినా కూడా కథనంలో ఎక్కడా ఆడియన్స్ ని క్రిష్ ఎంగేజ్ చెయ్యలేకపోయాడు. మొత్తానికి బాలయ్య బావ కళ్లలో ఆనందం చూడడానికన్నట్లు తీసిన మహానాయకుడు సినిమాకి పేరు మార్చి బాబు బయోపిక్ అనో లేక ది రైజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అనో పెట్టి ఉంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కొన్ని ఓట్లు అయినా వచ్చేవి. ఇప్పటికైతే కథానాయకుడు సినిమా ఫ్లాప్ నుంచి మహానాయకుడు అయినా కాపాడుతోందేమో అని ఆశించిన వారికి మాత్రం నిరాశ తప్పలేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *