చై,అఖిల్ కోసం కథలు వింటున్న నాగార్జున

చై,అఖిల్ కోసం కథలు వింటున్న నాగార్జున

అక్కినేని కింగ్ నాగార్జున సరిగ్గా ఏడాది క్రితం మంచి ఫామ్ లో ఉన్న హీరో,బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి జోష్ లో ఉన్న నాగ్ ఇప్పుడు ఫుల్ సీరియస్ గా ఉన్నాడు.దానికి కారణం ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ హీరో సినిమాల ఫలితాలే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా,ఎంత మంచి డైరెక్టర్స్ తో సినిమాలని చేయించినా కూడా అఖిల్,నాగ చైతన్య హిట్స్ కొట్టలేకపోతున్నారు.ముఖ్యంగా నాగ చైతన్య అయితే సినిమాలైతే వరసగా చేస్తున్నాడు కానీ గత రెండున్నర ఏళ్లుగా హిట్ అనే మాటే తెలియదు.ప్రస్తుతం చై చేతిలో ఆరేడు సినిమాలు ఉన్నా కూడా హిట్ కొడతాడా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.

మరో పక్క నాగార్జున రెండో కొడుకు అఖిల్ పరిస్థితి కూడా ఇదే.నిజం చెప్పాలంటే చై కంటే దారుణమైన పరిస్థితిలో అఖిల్ ఉన్నాడు.ఇప్పటికే మూడు సినిమాలు చేసిన అఖిల్ ఫస్ట్ అనేదే లేదు.విజయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు అని అది మాత్రం అఖిల్ కి అందని ద్రాక్షలాగే మిగిలింది.రీసెంట్ గా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా పోవడంతో అఖిల్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంపై క్లారిటీ కూడా లేదు.ఇద్దరి కొడుకుల్లాగే నాగ్ కెరీర్ కూడా డల్ ఉండడంతో ఇక నుంచి మళ్లీ సీరియస్ గా కథలు విని మంచి సినిమాలు సెట్ చేసుకొని…అఖిల్ ని.చై ని సెట్ చెయ్యడంతో పాటు తన కెరీర్ ని కూడా మళ్లీ లైమ్ లైట్ లోకి తీసుకురావాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నాడట. 2019లో అయినా హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్న నాగార్జున,రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు2ని మొదలు పెట్టాడు.మరి ఈ సినిమాతో అక్కినేని ఫామిలీ నుంచి కింగ్ నాగ్ అయినా హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *