యంగ్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తున్న నాగార్జున

యంగ్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తున్న నాగార్జున

నాగార్జున కెరియర్‌లో ఫీల్ గుడ్ మూవీగా నిలిచిన చిత్రం మన్మథుడు . ఈ సినిమాకు సీక్వెల్‌గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 తెరకెక్కుతుంది. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి కొన్ని పిక్ప్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు నాగ్… ఈ స్టిల్స్‌లో నాగార్జునని చూస్తుంటే..నవ మన్మథుడిలా కనిపిస్తున్నాడు. టాలీవుడ్ మన్మథుడు అన్న పేరుని సార్ధకం చేసుకుంటూ.. కుర్రహీరోలు కుళ్లుకునే ఫిజిక్ అండ్ స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు . 60కి చేరువైనా.. 30కి క్రాస్ అయిన ఇద్దరు కొడుకులూ ఉన్నా గ్లామర్ విషయంలో యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నాడు నాగార్జున. ప్రస్తుతం పోర్చుగ‌ల్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని ఇండియా షిఫ్ట్ అవ్వబోతున్నారు చిత్రటీమ్.ఇందులో నాగార్జునకు జోడీగా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ సైతం గ్లామర్ లుక్‌తో మెస్మైరైజ్ చేస్తుంది. మరి ఈ నవ మన్మథుడు ఆడియన్స్ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *