దేవదాస్ మూవీ రివ్యూ

దేవదాస్ మూవీ రివ్యూ

కింగ్ నాగ్, నాచురల్ స్టార్ నాని మొదటిసారి కలిసి నటించినసినిమా దేవదాస్… మూవీ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచే దీనిపై సినీ అభిమానుల్లో పాజిటివ్ ఒపీనియన్ ఏ ఉంది.. దాన్ని టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ తో ఆ అంచనాలని మరింత పెంచు నాగ్ నాని దేవదాస్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చారు. మరి ఈ సినిమా ఆడియన్స్ ని ఎంత వరకు అట్రాక్ట్ చేసిందో చూద్దాం.

nani nagarguna

నాగ్ నాని కలయికలో…

దాదా ఒక డాన్, తనని శత్రువులు చంపేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన దాదా పెంపుడు కొడుకు దేవ దాదాపు పదేళ్ల పాటు తర్వాత మళ్ళీ సిటీకి వస్తాడు.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దేవాని పట్టుకోవాలని, దాదాని చంపిన డేవిడ్ గ్యాంగ్ ఏమో దేవాని చంపలని ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో గాయాల పాలైన దేవా, ట్రీట్మెంట్ కోసం దాస్ ని కాలుస్తాడు… తర్వాత మృదుస్వభావి అయిన దాసు… డాన్ అయిన దేవా ఫ్రెండ్స్ అయిపోతారు. ఈ స్నేహం వలన వారి జీవితాల్లో వచ్చిన మార్పులు ఏంటి? దేవాగా దాస్ మారాడా లేక దాస్ గా దేవా మారాడా? పోలీసుల నుంచి డేవిడ్ గ్యాంగ్ నుంచి దేవా ఎలా తప్పించుకున్నాడు అనేదే దేవదాస్ కథ.

akanksha singh

డాన్ దేవాగా కనిపించిన నాగార్జున, స్క్రీన్ పై చాలా అందంగా కనిపించాడు, నాని కన్నాయంగ్ అండ్ స్టైలిష్ గా కనిపించాడు… తాను స్క్రీన్ పైన కనిపిస్తున్నంత సేపు పక్కవారిని చూడలేము. నాని కూడా చాలా బాగా యాక్టింగ్ చేసాడు.. ఈ ఇద్దరి కామెడీ టైమింగ్ తో సినిమాని ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసేలా చేశారు… ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వచ్చాయి.. ఈ ఇద్దరితోనే సరిపోవడంతో హీరోయిన్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. విలన్ గా నటించిన కునాల్ స్టైలిష్ ఎంట్రీతో అదరగొట్టినా కూడా నటించడానికి పెద్దగా ఆస్కారం లేదు.

 rashmika mandanna

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో…

ఇక డైరెక్టర్ గా శ్రీరామ్ ఆదిత్య తాను అనుకున్న కథని ప్రెసెంట్ చేయడంలో సక్సస్ అయినా కూడా స్క్రీన్ ప్లే కొంచెం తేడా కొట్టినట్లు అనిపిస్తుంది.. నాగ్ నానిల మధ్య వచ్చే కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ తప్ప, చెప్పుకోవడానికి పెద్దగా కథలో వచ్చే ట్విస్ట్ లు ఏమి లేవు… దేవదాస్ ప్రయాణం అలా సాగిపోతుందంతే. మణిశర్మ మరోసారి bgm  ఇవ్వడంలో తనకి తిరుగేలేదని ప్రూవ్ చేసుకున్నాడు, సినిమాటోగ్రఫీ బాగుంది.. ప్రొడక్షన్ వాల్యూస్ వైజయంతి మూవీస్ బ్యానర్ రేంజుకి తగ్గట్లు ఉన్నాయి. మొత్తానికి కొత్తదనం లేని కథే అయినా కూడా నాగ్ నానిల ప్రెజన్స్ తో దేవదాస్ ప్రేక్షకులని కొన్ని రోజుల పాటు నవ్వించొచ్చు కానీ లాంగ్ రన్ లో సినిమా పరిస్థితి ఏంటనేది చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *