చై సామ్ మూవీ టైటిల్ ఇదేనా ..?

చై సామ్ మూవీ టైటిల్ ఇదేనా ..?

ఈ వేసవిలో మజిలీ సినిమాతో ప్రేక్షుకుల మనసు దోచేసింది సమంత నాగచైతన్య జంట. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో గుండెలు పిండే ఎమోషన్స్ పండించారు చైసామ్. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం స్క్రీన్ షేరు చేసుకున్న ఈ జంట నిజ జీవితంలోనే కాదు వెండితెరపై కూడా సూపర్ హిట్ జోడీ అని నిరూపించుకున్నారు. ఇక చాలా కాలంగా సాలిడ్ హిట్‌ కోసం ఈగర్‌గా వెయింట్ చేస్తున్న చైతూకు మజిలీ కెరీర్‌లోనే మర్చిపోలేని హిట్‌గా నిలిచింది.ఈ మూవీ సక్సెస్‌తో చైతూ కెరీర్ గ్రాఫ్ కూడా బాగానే పెరిగిందని చెప్పోచ్చు.అయితే ఈ సినిమా తర్వాత నాగచైతన్య కొత్త సినిమా ఏ దర్శకుడితో చేయబోతున్నాడని డిస్కషన్ నడుస్తున్నాయి.

చైతూకు కొంతమంది దర్శకులు కథలు వినిపిస్తున్నారట. కానీ అవి ఈ అక్కినేని హీరోకు నచ్చడం లేదని తెలుస్తోంది. ఆర్ఎక్స్100 సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో చైతూ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలే చైతూకు కథని వినిపించాడట. అన్ని రకాల ఆడియన్స్‌కు నచ్చేలా స్టోరీ ఉండటంతో వెంటనే ఓకే చెప్పాడని సమాచారం. ఈ మూవీ మహాసముద్రం అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. విలైనంత త్వరగా ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కూడా చైతూకు జోడీగా సమంత నటించబోతుందని టాలీవుడ్ సర్కీల్‌లో టాక్ వినిపిస్తోంది.. దీంతో చైతూ సమంత మరోసారి కనువిందు చేయనుందనే వినిపిస్తుడటంతో అక్కినేని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయింట్ చేయాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *