"సవ్యసాచి" మూవీ రివ్యూ ...

"సవ్యసాచి" మూవీ రివ్యూ ...

లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్ అనే డిఫరెంట్ పాయింట్ కి అన్నీ కమర్షియల్ హంగులు అద్ది తెరకెక్కించిన సినిమా సవ్యసాచి. రిలీజ్ కి ముందు నుంచే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి మంచి మాస్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్య కోరికని సవ్యసాచి తీర్చిందో లేదో చూద్దాం. ఇద్దరు కవలలుగా పుట్టాల్సిన వాడు ఒక్కడిగానే పుడితే, ఆ రెండో వాడి బలం, ఆలోచనా విధానం కూడా ఒక్క చేతికే వస్తే ఎలా ఉంటుంది, సదరు వ్యక్తి ఎన్ని ఇబ్బందులు పడతాడు, అతని జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ఎలాంటివి అనేదే సవ్యసాచి కథ.

Savyasachi Review

డిఫరెంట్ పాయింట్ తో వచ్చిన సవ్యసాచి

లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్ తో పుట్టిన విక్రమ్, అసలు తన ఆదేనంలో లేని తన ఎడమ చెయ్ వలన చాలా ఇబ్బందులు పడుతుంటాడు. ఆ చెయ్ వలన వచ్చే సమస్యలు భరించలేక, లెఫ్ట్ ని అసహ్యించుకునే పరిస్థితికి వెళ్లిపోతాడు ఇలాంటి సమయంలో ఒక ఆక్సిడెంట్ లో విక్రమ్ బావ చనిపోతాడు, అక్క హాస్పిటల్ పాలవుతుంది మేనకోడల్ని కనిపించకుండా పోతుంది. ఇలా అనుకోని సంఘటనల మధ్య తన కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది, దీనంతటికి కారణం ఒక్కడే అని తెలుసుకున్న విక్రమ్. తన ఎడమ చెయ్ సాయంతో, ఎలా తన సమస్యలని పరిష్కరించుకున్నాడు అనేదే సవ్యసాచి కథా కథనం.

సినిమా కి హైలైట్ …సెకండ్ హాఫ్

సవ్యసాచి లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్ అనే డీఫరెంట్ పాయింట్ తో తెరక్కుతుందనే వార్తలు వచ్చినప్పటి నుంచి కొత్తగా ఎదో చూడబోతున్నాం అని సినీ అభిమానులు అనుకోని ఉంటారు. సవ్యసాచి మొదలైన తీరు కూడా అలానే ఉంటుంది, స్టార్టింగ్ మంచి పాయింట్ తో ఎత్తుకున్నా కూడా నెమ్మదిగా ఎడమ చెయ్ అనే పాయింట్ ఏ కనపడదు. సవ్యసాచికే వచ్చామా అన్నట్లు సాగేలా ఉండే ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా తప్ప లెఫ్ట్ హ్యాండ్ కి సంబందించిన సీన్స్ పెద్దగా లేవు. రెగ్యులర్ ప్రేమ కథ, కామెడీ సీన్స్ చుట్టూనే మొదటి భాగం అంతా ఉండడం కొంచెం నిరాశ పరిచే అంశం. ఇంటర్వెల్ బ్యాంగ్ లో మాధవన్ ఎంట్రీతో ఎత్తుకున్న సినిమా, సెకండ్ హాఫ్ అయ్యే వరకూ అద్భుతంగా సాగుతుంది.

Savyasachi Review

మాధవన్, నాగ చైతన్యల మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి, ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా ఉన్న ఈ ఎపిసోడ్స్ మధ్య కూడా అక్కడక్కడా అవసరంలేని కాలేజ్ సీన్స్ వస్తుంటాయి.అందులో విషయం ఉన్నా కూడా సినిమా ఫ్లోకి అడ్డుపడినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా లగ్గాయత్తు సాంగ్ ఆడియన్స్ రిలీఫ్ కోసం పెట్టామని డైరెక్టర్ రిలీజ్ కి ముందు నుంచీ చెప్పాడు కానీ ఆ పాట ఎంత బాగున్నా కూడా సినిమా పీక్ స్టేజ్ లో ఉండగా వచ్చిన ఆ పాట అప్పటి వరకు సినిమాలో ఎంగేజ్ అయిన ఆడియన్స్ ని ఒక్కసారిగా డైవర్ట్ చేస్తుంది. మళ్లీ ప్రీ-క్లైమాక్స్ నుంచి స్పీడ్ అందుకున్న సవ్యసాచి. ఆ తర్వాత వచ్చే సీన్ సూపర్ గా ఉంటుంది. క్లైమాక్స్ వరకూ అద్భుతంగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కథని కొంచెం త్వరగా మొదలు పెట్టినా, లవ్ ట్రాక్ కొంచెం తగ్గించినా సవ్యసాచి ఇంకో రేంజులో ఉండేది.

సవ్యసాచిని కాపాడిన మాధవన్ , చైతన్య

ఇక నటీ నటుల గురించి చెప్పుకోవాలని అంటే సవ్యసాచి సినిమా మొత్తం మాధవన్, నాగ చైతన్యదే. మిగిలిన పాత్రలన్నీ సో సో గానే ఉంటాయి కానీ హీరో విలన్ కలిసి సవ్యసాచిని కాపాడారు. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు, తన స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది.సవ్యసాచిలో ఫస్ట్ హాఫ్ లో రెగ్యులర్ గానే కనిపించిన చెయ్ సెకండ్ హాఫ్ లో మాత్రం ముందెన్నడూ చూడని నాగ చైతన్యని చూస్తాం. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ లో కానీ కామెడీ టైమింగ్ లో కానీ అన్నింట్లో ఇది నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అయ్యింది. మొదటిసారి పూర్తిస్థాయి విలన్ గా కనిపించిన మాధవన్. తన అద్భుతమైన నటనతో కట్టి పడేస్తాడు. నాగ చైతన్యకి, తన రెండో చెయ్ బలమైతే సవ్యసాచి సినిమాకి మాధవ్ ఏ ప్రధాన బలం…

దర్శకత్వంలో…

డైరెక్టర్ గా మంచి పాయింట్ తీసుకున్న చందూ మొండేటి దాన్ని పూర్తి స్థాయిలో నడిపించలేక పోయాడు, మొదటి భాగం అయిపోయే వరకూ లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్ అనే పాయింట్ నే టచ్ చేయకపోవడంతో ఒక రెగ్యులర్ సినిమా చుసిన ఫీలింగ్ కలిగిస్తుంది. మాధవన్ ఎంట్రీ వరకూ రెగ్యులర్ ప్రేమకథతో, కామెడీ సీన్స్ తో నిరాశ పరిచాడు. ఆ సీన్స్ బాగున్నా కూడా ఆడియన్స్ కి సవ్యసాచి లాంటి డిఫరెంట్ పాయింట్ తో వచ్చిన సినిమా చేస్తున్నామనే ఫీలింగ్ మాత్రం పోగొడుతుంది. ఇక సెకండ్ హాఫ్ బాగా గ్రిప్పింగ్ గా రాసుకున్న చందూ.. కానీ విలన్ అంత మందిని చంపడానికి అవసరమైన కారణం మాత్రం కొంత వీక్ గానే అనిపిస్తుంది. విలన్ కి హీరోకి మధ్య సీన్స్ బాగా రాసి, అంతే బాగా ప్రెసెంట్ చేసిన చందు డిఫరెంట్ పాయింట్ ని తెలుగు ప్రేక్షకులకి చూపించాడు. సవ్యసాచి టైటిల్ సాంగ్ కానీ, సెకండ్ హాఫ్ లో వచ్చే bgm కానీ గూస్ బమ్స్ వచ్చేలా ఉంది… సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తానికి సవ్యసాచి సినిమా కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్యకి కొన్ని డ్రా బాక్స్ ఉన్నపటికీ మంచి సక్సస్ ని అందించే సినిమా అయ్యింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *