చైతూ కెరీర్‌లోనే రిలీజ్‌కు ముందే బెస్ట్ బిజినెస్ చేసిన మజిలీ

చైతూ కెరీర్‌లోనే రిలీజ్‌కు ముందే బెస్ట్ బిజినెస్ చేసిన  మజిలీ

అక్కినేని నాగచైతన్య కెరీర్ ఆప్ అండ్ డౌన్‌ గురించి తెలిసిందే. లవర్ బాయ్‌గా ముద్ర వేసుకున్న చైతూ మార్కెట్‌లో మాస్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకోవడం కోసం ఎంత ప్రయత్నించిన వర్కౌట్ కాలేదు.మాస్ కంటెంట్ సినిమాలు చేసిన ప్రతిసారి ఫెయిలయ్యాడు.కానీ లవ్ అండ్ ఫ్యామిలి స్టోరీస్‌లో సినిమాలు చేసిన ప్రతిసారి సూపర్ హిట్ అందుకున్నాడు.లవ్ అండ్ ఫ్యామిలి కథలే చైతూ బాడీ లాంగ్వేజ్‌కు కరెక్ట్‌గా సూట్ అవుతాయనే ముద్ర ప్రేక్షకుల్లో పడింది. అయితే ఈ సారి మాత్రం ఇంతకుముందు చేసిన సినిమాలన్ని కంటే కూడా డిఫరెంట్ స్టోరీతో ఓ మధ్య తరగతి నేపథ్యంతో మజిలీ చిత్రం చేస్తున్నాడు.ఈ సినిమాలో లవ్ ,ఎమోషన్స్ ఉంటేలా ప్రతి ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా చాలా జాగ్రత్త తీసుకోని సినిమా చేశాడు.దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్ డేట్ కూడా ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది..దీంతో ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని ఈ మూవీ నిర్మాత సెఫ్ జోన్లోకి వెళ్లిపోయ్యాడని తెలుస్తోంది.

naga chaitanya samantha new look
రీసెంట్‌గా రిలీజైన సాంగ్స్‌కు ,చైతూ,సమంత లుక్స్‌కు,టీజర్‌కు,అలాగే చైతన్య,సమంత జోడీ మధ్య కెమిస్ట్రీ ప్రతిదీ కూడా సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.దీంతో రిలీజ్‌కు ముందే 15 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది..థియేట్రికల్ రైట్స్,డబ్బింగ్,శాటిలైట్ డిజిటల్ రైట్స్‌ని ఓ ప్రముఖ సంస్థ భారీ మొత్తం చేల్లిందట.ఇక శాటిలైట్ హక్కుల్ని ఓఎంటర్ టైన్మెంట్ చానెల్ 5కోట్లకు దక్కించుకుంది.3.5కోట్లకు అమెజాన్ డిజిటల్ హక్కుల్ని కొనుక్కుందని సమాచారం.అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో మరో 4కోట్లు వచ్చాయని తెలుస్తోంది..చైతూ కెరీర్‌లో రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్ చేసిన సినిమాగా మజిలీ నిలిచింది. శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలతో ఫ్లాప్ అందుకున్న చైతూ ఈ సినిమాతో అయినా కంబ్యాక్ అవుతాడో లేదో చూడాలి మరి…

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *