బాలయ్య గెలుపు నాగబాబుకు చుక్కలు చూపిస్తోందా?

బాలయ్య గెలుపు నాగబాబుకు చుక్కలు చూపిస్తోందా?

సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ చాలా యాక్టివ్ గా ఉంటారు, బాలకృష్ణ కి సంబంధించిన ఏ అప్డేట్ బయటకి వచ్చినా ఆన్లైన్ లో వాళ్లు రచ్చ చేస్తారు… అలాంటిది, టీడీపీ ఘోరంగా ఓడిపోయినా కూడా బాలకృష్ణ మాత్రమే 17వేల మెజారిటీతో గెలవడంతో, అభిమానుల ఆనందంకి అడ్డే లేకుండా పోయింది… అయితే ఈ ఆనందం మెగా బ్రదర్ నాగబాబుకు పెద్దనొప్పిగా మారింది. గత కొంతకాలంగా బాలకృష్ణని, టీడీపీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన నాగబాబు, అభిమానులని కొడుతున్న బాలయ్య హిందూపూర్ లో ఈసారి ఎలా గెలుస్తాడో చూస్తానంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు…

బాలయ్య ఎన్నికల ప్రచార విధానాన్ని చూసిన కొందరు అభిమానులు కూడా ఆయన ఓడిపోతాడేమో అనుకున్నారు…వారి అంచనాలని తలకిందులు చేస్తూ బాలకృష్ణ, హిందూపూర్ గడ్డ తన అడ్డా అని నిరూపిస్తూ… బంపర్ మెజారిటీతో మరోసారి గెలిచి చూపించాడు. బాలయ్య గెలిచిన ఆనందంలో ఉన్న నందమూరి అభిమానులు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాగబాబుపై కౌంటర్లు వేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *