హింసను ఎదిరించి... నోబెల్‌శాంతి జయించి

హింసను ఎదిరించి... నోబెల్‌శాంతి జయించి

ఇరాక్‌లో యాజిదీలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతం సిరియా. సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అక్కడి మహిళల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తారు. 2014లో నదియా నివసించే కోచో ప్రాంతంలో ఐఎస్ ఉగ్రవాదులు ప్రవేశించారు. నల్ల జెండాలతో ట్రక్కుల్లో వచ్చారు. ఆ ప్రాంతంలోని పురుషులను ఇష్టం వచ్చినట్టుగా చంపేశారు. చిన్న పిల్లలను ఉగ్రవాదులుగా మార్చేందుకు తీసుకెళ్లిపోయారు. వేలాది మంది స్త్రీలను పనిమనుషులుగా మార్చేందుకు, లైంగికంగా వాడుకునేందుకు తీసుకెళ్లిపోయారు.

Nadiya Nobel Award

నరకకూపం…

ఆ సమయంలోనే ఉగ్రవాదులు నదియాను కూడా అపహరించారు. కొన్ని నెలల పాటు బంధించి సాముహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. విపరీతంగా కొట్టి హింసించారు. కొంతమంది బాలికలను, మహిళలను మార్కెట్‌లో అమ్మేశారు. బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి పెళ్లిల్లు చేసుకున్నారు. ఎన్నో ఇబ్బందులుకు గురైన నదియా ఓ ముస్లిం కుటుంబం సహాయంతో మోసుల్ అనే నగరం నుంచి తప్పించుకుంది. వారి చెర నుండి తప్పించుకున్న నదియా, నకిలీ పత్రాలతో ప్రయాణించింది. యూజిదీలు నివసించే ప్రాంతానికి చేరుకుంది. అప్పటికే తన తల్లీ, సోదరులు మరణించారని తెలుసుకుంది. అంత కష్టంలోనూ దు:ఖాన్ని ఆపుకుని, ఓ సంస్థ సహకారంతో జర్మనీలో ఉండే తన సోదరి దగ్గరకు పారిపోయింది.

పోరాటం…

అప్పటినుండి తన సోదరి దగ్గరే ఉంటూ…నరకకూపంలో ఇరుక్కున్న యూజిదీ మహిళలను, బాలికలను కాపాడడానికి ప్రయత్నిస్తూనే ఉంది. తనమీద జరిగిన అత్యాచారాల గురించి, దారుణాల గురించి 2015 లో ఐక్యరాజ్య సమితి మండలిలో మాట్లాడింది. వాళ్ల దుర్మార్గం గురించి కళ్లకు కట్టినట్టు చెప్పింది. ఆమె ధైర్యానికి ఐక్యరాజ్య సమితి గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. అమె జీవితం గురించి 2017లో ‘ ది లాస్ట్ గర్ల్ ‘ అనే పుస్తకం కూడా విడుదలైంది. మహిళల పట్ల, బాలికల పట్ల ఉన్న విపరీతమైన లైంగిక హింసను అరికట్టేందుకు కృషి చేసినందుకుగానూ ఆమెకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *