ముందు టైర్ లేకుండానే విమానం ల్యాండింగ్...పైలట్ సమయస్పూర్తికి సెల్యూట్

ముందు టైర్ లేకుండానే విమానం ల్యాండింగ్...పైలట్ సమయస్పూర్తికి సెల్యూట్

ఉదయాన్నే లేచి పేపర్ తిరగేస్తే…కారు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, లారీ ప్రమాదాలు అనే వార్తలను ఎక్కువగా చదివేవాళ్లం. ఇపుడు పరిస్థితులు మారాయి, సంఘటనలు మారాయి…ప్రమాదాలకు గురయ్యే వాహనాలూ మారాయి. ఈ మధ్య కాలంలో విమానాల ప్రమాదాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వాతావరణ పరిస్థితులు కావచ్చు, టెక్నాలజీలో లోపం వల్ల కావచ్చు…పదుల సంఖ్యలో విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యనే రష్యాలో విమానం కూలిన ప్రమాదంలో 40మందికి పైగా మరణించారు. ఇపుడు కొత్తగా మయన్మార్‌లో ఘోర ప్రమాదం నుంచి ఓ విమానం తృటిలో తప్పించుకుంది. కాస్తలో ప్రాణాపాయం తప్పడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఊపిరి బిగబట్టుకుని బయటపడ్డారు. అసలు సంగతేంటో తెలుసుకుందాం!

యాంగూన్‌లోని మాండలే ఎయిర్‌పోర్ట్‌లో ఒక విమానం ల్యాండింగ్‌కు సిద్ధమైంది. అదే సమయంలో విమానం ముందు టైర్లు తెరుచుకోలేదు. ప్రమాదాన్ని ఊహించిన పైలట్..ఫ్లైట్‌ను ఎంతో నేర్పుగా నడిపి, విమానాన్ని జాగ్రత్తగా కిందకు దించాడు. ఎలాంటి ఘోరం జరగకుండా బయటపడినందుకు ఆ విమానంలోని ప్రయాణికులు, వారితో ఉన్నటువంటి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

మయన్మార్ ఎయిర్ లైన్స్‌కు చెందిన యూబీ-103 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో గేర్ ఫెయిలైంది. దీంతో అప్రమత్తమైన పైలట్..కేవలం వెనుక టైర్ల సాయంతో బ్యాలెన్స్ చేసి ల్యాండింగ్ చేశాడు. ఈ క్రమంలో విమానం ముందు భాగం నేలకు గుద్దుకున్నప్పటి ఫ్లయిట్ పూర్తిగా ల్యాండైంది. దీంతో ఫైలట్ సమయస్ఫూర్తికి ప్రయాణికులంతా ధన్యవాదాలు చెప్పారు. ఈ ఘటన జరిగిన సందర్భంలో ఫ్లైట్‌లో 82మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. అతిపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నందుకు ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *