వేధించినవాడి మర్మాంగం కోసేసింది...

వేధించినవాడి మర్మాంగం కోసేసింది...

ఆడవాళ్లపై వేధింపులు ఇప్పుడు కొత్తగా మొదలైనవి కావు. అనాధిగా నడుస్తూనే ఉన్నాయి. మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థలోకి అడుగు పెట్టిన తొలినాళ్ల నుంచి ఇలాంటి వార్తలను వింటూనే ఉన్నాం. స్థలాలకూ, ప్రదేశాలకూ, ప్రాంతలకూ, వయసులకూ అతీతంగా మహిళలు ఇబ్బందిపాలవుతూనే ఉన్నారు. అలా ఎన్నో రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒకమ్మాయి కఠిన నిర్ణయం తీసుకుంది.

మర్మాంగాన్ని కోసింది…

అది ముంబై మహా నగరం లోని డోంబివిలీ ప్రాంతం. తషార్ అనే యువకుడు ఒకమ్మాయిని వేధిస్తున్నాడు. పద్ధతి మార్చుకోమని అతనికి చాలాసార్లు చెప్పి చూసింది. అంతకంతకూ అతడి వేధింపులు ఎక్కువయ్యాయి. రోజురోజుకూ టార్చర్‌ ఎక్కువైపోయింది. ఆ అమ్మాయి రోడ్డు మీదికి రావలన్నా భయపడిపోయే పరిస్థితిని కల్పించాడు. ఇలా కాదనీ, ఎంత చెప్పినా వినడం లేదనీ కఠిన నిర్ణయం తీసుకుందామనునకుంది. బుద్ధి చెప్పాలనుకుంది. దీని కోసం ఇద్దరి యువకుల సాయం తీసుకుంది. మాట్లాడుకుందాం రమ్మని ముందుగానే ప్లాన్‌ చేసుకున్న ప్రదేశానికి తుషార్‌ను పిలిపించింది. అతడి వచ్చీ రాగానే ఇద్దరి స్నేహితుల సాయంతో మర్మాంగాన్ని కోసేసింది.

mumbai news

ఆస్పత్రిలో…

మర్మాంగాన్ని కోసిన తర్వాత… కుప్పకూలిపోయి తీవ్ర రక్తస్రావంతో కిందపడి కొట్టుకుంటున్న తుషార్‌ను ఆమె ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందిని డాక్టర్లు చెప్తున్నారు. ఆ మహిళపైనా, సాయం చేసిన ఇద్దరి యువకుల పైనా కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *