ధోనీ కొత్త గేమ్...

ధోనీ కొత్త గేమ్...

రెండు వారాల క్రితం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కబడ్డి ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పైగా, ఆ ఆటలో ఒకరిని ఔట్ చేసి ఏ ఆటైనా ఆడగలనని నిరూపించాడు. వన్డేలకు మాత్రమే పరిమితమైన ధోనీ…ఖాళీ సమయాల్లో ఇతర క్రీడలను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం భారత టీమ్ ఆస్ట్రేలియా టూర్‌లో ఉంది. టీ20 సిరీస్‌లో ధోనీ దూరమైన సంగతి మనకు తెలిసిందే…వచ్చే ఏడాదిలోనే మళ్లీ వన్డే మ్యాచ్‌లు మొదలవుతాయి. అప్పటిదాకా ఇలా వేరే ఆటలు ఆడుతూ సరదాగా ఉంటున్నాడు.

Dhoni playing Tennis

టెన్నిస్ టైమ్!

విలువైన ఈ ఖాళీ సమయన్ని వృధా చేయకుండా ఫ్యామిలీతో గడుపుతున్న ధోనీ, తాజాగా భార్య సాక్షి పుట్టినరోజు వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేశాడు. ఈ ట్రిప్‌లో భాగంగా రాచీ వెళ్లాడు ధోనీ. రాంచీలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టెన్నిస్ ఆడాడు. ఇది చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలను విపరీతంగా పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. కొందరైతే ‘ఇట్స్ టెన్నిస్ టైమ్ ‘ అని కామెంట్లు పెడుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *