పప్పా, మమ్మాలా ఓటేయమన్న ధోని కుమార్తె!

పప్పా, మమ్మాలా ఓటేయమన్న ధోని కుమార్తె!

ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ.. మ్యాచ్‌కు ముందురోజు ప్రాక్టీస్ వదిలిపెట్టి ఒక పౌరుడిగా తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. రాంచీ వెళ్లి ఓటేసి వచ్చాడు. ఓటు వేయడం అవగానే…తన కుమార్తెతో కలిసి చిన్న వీడియో ఒకటి చేశాడు. అందులో ధోని కూతురు ముద్దుముద్దుగా అందరికీ ఓటు వేయలని చెప్పిద్ని. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సీజన్‌లో ధోనీ జట్టు ప్లేఆఫ్‌కు చేరిన మొదటిజట్టనే సంగతి తెలిసిన విషయమే..!

చివరి మ్యాచ్‌లో ఓటమి కారణంగా ప్రస్తుతం రెండో ప్లేసులో ఉంది. మంగళవారం టేబుల్ టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఆడనుంది. అయితే, ధోనీ సోమవారం ప్రాక్టీస్‌ను వదిలి రాంచీకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాంచీ, జవహార్ విద్యామందిరంలోని పోలింగ్ కేంద్రానికి భార్య సాక్షి సింగ్, తల్లిదండ్రులు దేవికా దేవి, పాన్ సింగ్‌లతో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

ఆ తర్వాత తన కూతురు జీవా సింగ్‌తో కలిసి ఓటు వేయాలంటూ సందేశం ఇచ్చాడు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. “పప్పా, మమ్మాలా మీరు కూడా వెళ్లి ఓటు వేయండి” అంటూ జీవాసింగ్ ముద్దుముద్దుగా చెప్పింది. అనంతరం ధోనీ థ్యాంక్స్ చెబుతూ ఓటు వేసిన వేలు చూపించాడు.

 

View this post on Instagram

 

Use your Power

A post shared by M S Dhoni (@mahi7781) on

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *