సచివాలయం కూల్చొద్దంటూ రేవంత్‌ పిటీషన్‌

సచివాలయం కూల్చొద్దంటూ రేవంత్‌ పిటీషన్‌

తెలంగాణా సీఎం కేసీఆర్ మరోసారి ఆయన స్టైల్‌లో దూసుకుపోయారు. వివాదాలు చుట్టుముట్టినా… విపక్షాలు గొంతెత్తి అరిచినా… పట్టించుకోలేదు. చారిత్రక కట్టడాన్ని కూల్చొద్దనే డిమాండ్లు వినిపించినా… ప్రజాధనం దుర్వినియోగమవుతోందని గోలపెట్టినా.. లెక్క చేయలేదు. తనదైన స్టైల్లో ముందుకెళ్లారు. చేయాలనుకున్న పని చేసేశారు. కొత్తగా నిర్మించనున్న అసెంబ్లీ, సచివాలయ భవనాలకు భూమి పూజ చేశారు.

400 కోట్లతో నిర్మించనున్న కొత్త సచివాలయానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతమున్న సెక్రటేరియట్ డి – బ్లాక్ వెనుక ప్రాంతంలోని గార్డెన్ ఏరియాలో నూతన సచివాలయం నిర్మిస్తున్నారు. దీంతో 25 ఎకరాల్లో విస్తరించి ఉన్న సచివాలయాన్ని 30 ఎకరాలకు పొడిగించినట్లైంది. చరిత్రలో నిలిచిపోయేలా కొత్త సచివాలయం నిర్మించాలని.. సకల సౌకర్యాలతో, అన్ని హంగులతో రూపుదిద్దనున్నారు. ఈ వరల్డ్ క్లాస్ నిర్మాణానికి కేసీఆర్ గురువారం భూమిపూజ చేశారు.

అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా కాన్ఫరెన్స్ హాల్‌ నిర్మించనున్నారు. ఇకపై కలెక్టర్లతో.. సీఎం వీడియో కాన్ఫరెన్సులు సచివాలయంలోనే జరిపించేందుకు వీలుగా నిర్మాణం జరగబోతోంది. దాదాపు 6లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే కొత్త సచివాలయంలో మంత్రులు, సంబంధిత శాఖల కార్యదర్శులు, సెక్షన్లు అన్నీ ఒకే దగ్గర ఉండేలా నిర్మాణాలు జరగనున్నాయి.

అదలావుంటే కొత్త సచివాలయం నిర్మాణంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందంటూ అపొజిషన్ లీడర్లు మండిపడుతున్నారు. సచివాలయం నిర్మాణాన్ని అడ్డుకునేలా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే న్యాయపోరాటం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్ పై శుక్రవారం విచారణకు రానుండగా.. ఇంతలోనే కేసీఆర్ భూమిపూజ చేయడం చర్చానీయాంశమైంది.

ఏది ఏమైనా.. కేసీఆర్ మాత్రం తను అనుకున్నది చేసి తీరుతారని మరోసారి నిరూపిస్తారు. దానీ పర్యావసానాలు ఎలా ఉన్నా గానీ… తలపెట్టిన పనిని మాత్రం అనుకున్న టైంలో చేసుతీరుతారు. అయితే.. హైకోర్టు తీర్పు కేసీఆర్‌కి అనుకూలంగా ఉంటుందో.. ప్రతికూలంగా ఉంటుందో చూడాలి మరి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *