ఉతప్పను ట్రోల్స్‌తో ఉతికేస్తున్న నెటిజన్లు

ఉతప్పను ట్రోల్స్‌తో ఉతికేస్తున్న నెటిజన్లు

ఇపుడు ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రతీ మ్యాచ్‌ని వారి అభిమానులు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆదివారం ప్లేఆఫ్ కోసం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. అయితే టీమ్ మొత్తంలో రాబిన్ ఉతప్పా పూర్తీ వైఫల్యం కారణంగానే మ్యాచ్‌తో పాటు, ఇకముందు కూడా ఆటలో కొనసాగలేని స్థితికి ఉతప్పనే కారణమని నెటిజన్లు అతనిపై ట్రోల్స్‌తో విరుచుకుపడ్డారు. ఇపుడు ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రతీ మ్యాచ్‌ని వారి అభిమానులు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆదివారం ప్లేఆఫ్ కోసం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. అయితే టీమ్ మొత్తంలో రాబిన్ ఉతప్పా పూర్తీ వైఫల్యం కారణంగానే మ్యాచ్‌తో పాటు, ఇకముందు కూడా ఆటలో కొనసాగలేని స్థితికి ఉతప్పనే కారణమని నెటిజన్లు అతనిపై ట్రోల్స్‌తో విరుచుకుపడ్డారు.

ఐపీఎల్ 2019 సీజన్‌లో ప్లేఆఫ్‌కి చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్  బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప ఆడిన తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. ముంబయి ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప 47 బంతుల్లో 40 అతి నెమ్మదైన ఇన్నింగ్స్ ఆడ్డంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 7 వికెట్ల నష్టపోయి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేదనలో అదే పిచ్‌పై రోహిత్ శర్మ 48 బంతుల్లో 55 నాటౌట్‌గా నిలిచాడు, సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 46 నాటౌట్, డికాక్ 23 బంతుల్లో 30 పరుగులతో దూకుడుగా ఆడటంతో ముంబయి జట్టు మరో 23 బంతులు మిగిలుండగానే 134/1తో సులభంగా విజయాన్ని అందుకుంది.

పేలవమైన పరాజయంతో కోల్‌కతా 12 పాయింట్లతో జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 12 పాయింట్లతో అనూహ్యంగా ప్లేఆఫ్ బెర్తుని ఖరారు చేసుకుంది. పాయింట్లు సమానంగానే ఉన్నా.. కోల్‌కతా +0.028 కంటే హైదరాబాద్ +0.577 నెట్‌ రన్‌రేట్‌తో ముందు ఉండటం కలిసొచ్చింది. ఒకవేళ వాంఖడేలో కోల్‌కతా గెలిచి ఉంటే.. అప్పుడు ఆ జట్టు ప్లేఆఫ్‌కి చేరుండేది.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చేది. అపీఎల్ 2019 సీజన్ ఆరంభం నుంచి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటైనా ఆడలేకపోయిన రాబిన్ ఉతప్ప.. కీలక మ్యాచ్‌లో ఎక్కువ సేపు క్రీజులో నిలబడినా.. జట్టుకి కావాల్సిన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో శుభమన్ గిల్ 9 పరుగులు చేసి ఔటవడంతో క్రీజులోకి వెళ్లిన రాబిన్ ఉతప్ప..మొదట కొంచెం దూకుడుగా ఆడినట్లు కనిపించినా.. శ్లాగ్ ఓవర్లలో మరీ నెమ్మదైపోయాడు.

ఆఖరి ఓవర్ వరకూ క్రీజులో ఉన్నాడు కానీ.. ఏ దశలోనూ జట్టుకి భారీ స్కోరు అందించాలనే తాపత్రయం అతడిలో కనిపించలేదు. ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. ఇన్నింగ్స్ నడిపించాడు. ఒకవేళ రాబిన్ ఉతప్ప.. బ్యాట్‌కు పని చెప్పి ఉంటే అదనంగా కనీసం 30 పరుగులు చేసి ఉన్నా కోల్‌కతా పోరాడేందుకు కాస్త అవకాశం ఉండేది. ఉతప్ప ఇంత పేలవంగా ఆడటంతో అతనిపై నెటిజన్లు రకరాల వ్యాఖ్యలతో, సెటరిలు, మెమెలతో ఉతప్పని టార్గెట్ చేస్తూ ట్రోల్ ఉద్యమం మొదలుపెట్టారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *