8 నిమిషాల్లోనే..రూ. 778 కోట్లకు అమ్ముడు పోయిన పెయింటింగ్‌!

8 నిమిషాల్లోనే..రూ. 778 కోట్లకు అమ్ముడు పోయిన పెయింటింగ్‌!

ప్రఖ్యాత ఫ్రెంచ్‌ చిత్రకారుడు క్లాడ్‌ మోనెట్‌ కుంచె నుంచి జాలువారిన ఓ కళాఖండం వేలంలో రికార్డు ధర పలికింది. మ్యూల్స్‌గా నామకరణం చేసిన ఈ పెయింటింగ్‌ 110.7 మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే ఈ పెయింటింగ్ ధర మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 778 కోట్ల రూపాయలు. తద్వారా అత్యధిక ధరక పలికిన ఇమ్‌ప్రెసినిస్ట్‌ పెయింటింగ్‌గా చరిత్ర సృష్టించింది. హేస్టాక్‌ కలెక‌్షన్‌లో భాగంగా ఓ సంస్థ ఈ ఏడాది నిర్వహించిన వేలంలో మ్యూల్స్‌ సహా కేవలం మూడు పెయింటింగులు మాత్రమే అమ్ముడుపోయాయి. తన పొరుగింటి వ్యక్తికి చెందిన కోతకొచ్చిన గోధుమ పంటను 25 రకాల పెయిటింగ్‌లలో మోనెట్‌ అద్భుతంగా చిత్రీకరించారు. కేవలం 8 నిమిషాల్లోనే ఈ పెయింటింగ్ అమ్ముడుపోయింది. అయితే ఈ పెయింటింగ్ ను సొంతం చేసుకున్న వ్యక్తి వివరాలను నిర్వాహకులు వెల్లడించలేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *