వివాదంలో భద్రాచలం రాముడు..

వివాదంలో భద్రాచలం రాముడు..

దేవుళ్లకే వివాదాలు తప్పడం లేదు. అందరిని రక్షించే స్వామి వారికి, అందరిని నడిపించే ఆ స్వామి వారికే ఇప్పుడు సమస్యలు వచ్చి పడ్డాయా? ఆ దేవ దేవుడే వివాదాల్లోకి కూరుకుని పోయాడా..? ఏకంగా ఆ స్వామి వారికి వచ్చిన సమస్య కోర్టు దాకా వెళ్లిందా..? అయితే ఇప్పుడా కోర్టు సమస్యను పరిష్కారం చేస్తుందా.. లేక స్వామి వారే పరిష్కారం చేసుకుంటాడా..? ఇంతకీ వివాదంలోకి ఎక్కిన దేవుడు ఎవరు..? ఏంటా ఆ కథ..అనే అంశం పై మోజో ప్రత్యేక కథనం..

భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో ఇప్పుడో వివాదం ముసురుకుంటుంది. రామయ్య అందరి వాడు.. ఇప్పుడు మాత్రం ఆ రామయ్యను మార్చేస్తున్నారని కొంత మంది కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడ ఆ సమస్య పై దేవాదాయ శాఖ కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో కానీ ఇప్పుడు పెద్ద వివాదమే సాగుతోంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ని రామ నారయణ అని పిలువడమే ఇప్పుడు సమస్యగా మారింది. రామ నారాయణుడిగా పిలుస్తున్నారంటూ ఇది సరైనది కాదంటూ గతంలో కొంత మంది వివాదాన్నిలేవనెత్తారు. గత నాలుగు సంవత్సరాల నుంచి వివాదం సాగుతోంది. ఈనేపద్యంలోనే ఈ విషయం కోర్టుకు కూడ ఎక్కింది. రామ నారాయణ అనే పిలుపు సరైనది కాదని, రాముడి గోత్రాలను కూడ తప్పుగా చదువుతున్నారంటూ ఈ పిర్యాదులో ఉందట. అయితే ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర దేవాదాయ శాఖ ను ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఇ.ఓ. కు కూడ ఉత్తర్వులు అందాయని సమాచారం. మరి ఈ వివాదం ఎటు తిరుగనుందో కాని… ఇలా కోర్టుకు వెళ్లడం పట్ల ఆలయ వైదిక కమిటీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కొంత మంది ఏమి తెలియని వారు, వైదిక కమిటికి కూడ సంబందం లేని వారు వివాదానికి కారణబూతులు అవుతున్నారని అంటున్నారు. స్వామినే నమ్ముకున్న తమ వంటి వారికి ఇది చాలా బాదకరంగా ఉందని అంటున్నారు.

పవిత్ర గోదావరి తీరంలో వెలసిన శ్రీ భద్రాచలం సీతారామ చంద్ర స్వామి రాముడా.. లేక రామనారాయణడా అనేది వివాదం. అయితే దశావతారాల్లో రాముడు కూడ ఒక బాగమే అని అందరి నమ్మకం. దశావతారంలో రాముడు ఒక బాగం అయితే వివాదం ఎందుకు.? ఎలా వచ్చింది.? ఎవ్వరు తీసుకుని వస్తున్నారు. దశావతారంలో రాముడు ఒక బాగమే అయినప్పటికి, ఇప్పుడు రాముడుని రామనారాయణుడు అని పిలిస్తే నష్టమేమిటి, ఎందుకు ఈ వివాదం వచ్చింది. దశవాతారాల్లో రాముడు ఒక బాగమే అయినప్పటికి, రాముడి కాలానికి ఆయన అనుచరించిన విదానానికి తేడా ఉంటుంది. అందరు దేవుళ్ల మాదిరిగా కాకుండా రామఅవతారం బిన్నంగా ఉంటుంది. రాముడు మానవ నిర్మితంగా కనిపిస్తాడు, ఏక పత్నీ వ్రతుడిగా, తండ్రి మాటను జవ దాటని వ్యక్తిగా రామున్ని కీర్తిస్తారు.. ఎటువంటి చిన్న ఆరోపణలను సైతం రావడానికి ఇష్ట పడని దేవుడిగా రామున్ని నమ్ముతారు..

దశావతారాల్లో ఉన్న దేవుళ్లకు ఒక ప్రత్యేకత ఉంటుంది. రాముడికి మరో ప్రత్యేకత ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో అందరు దేవుళ్లకు బహు బార్యత్వంతో పెళ్లి జరుగడం ఆనవాయితీ, రాముడికి మాత్రం వేరే విదంగా ఉంటుంది. రాముడికి ఒక్క సీత తో మాత్రమే వివాహం జరుగుతుంది. అందువల్ల రాముడిని ప్రత్యేకంగా చూడాలని ఒక వర్గం ఆరోపిస్తోంది. దేశ వ్యాపితంగా శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. రాముడి కళ్యాణం అంటేనే అది భద్రాచలంగా చెప్పుకుంటారు. ఇక్కడ జరిగే రామ కళ్యాణానికి ఎంతో ప్రఖ్యాతి తో పాటు పేరు కూడా ఉంది. ఈనేపద్యంలో ఇక్కడ జరిగే కళ్యాణంలో గత కొంత కాలంగా రాముడి గురించి మాట్లాడేటప్పుడు రామ నారాయణుడు అంటున్నారని కొంత మంది ఆరోపణ. అదే విదంగా రాముడి అసలు వంశం వృక్షం, గోత్రం మార్చుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి రాముడి కుటుంబం గోత్రం వశిష్ట గోత్రం కాగా, వెంకటేశ్వర స్వామి దశావతారాల్లో ఉన్న దేవ దేవుల గోత్రం అచ్యుత గోత్రం.. ఇక్కడ రాముల వారి గోత్రాన్ని అచ్యుత గోత్రంగా చదువుతుంటారు… ఒక్క రామ నారాయణుడి అని పిలువడమంటేనే నారాయణుల్లో ఒక్కరిగా నామకరణం చేసినట్లు ఉంటుంది. అదేవిదంగా గోత్రం కూడ మార్చుతున్నారని ఆరోపణ.. గత కొంత కాలంగా ఈ వివాదం సాగుతోంది. ఈవివాదం పై ఇప్పుడు కోర్టును కూడ ఆశ్రయించారు. ఇది సరైన విదానం కాదని, ఇలా రాముడిని పిలిచే విదానం మార్చుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దేశంలో మరెక్కడ కూడ రాముల వారి గోత్రాన్ని తారు మారు చేయడం లేదు. ఒక్క భద్రాచలంలోనే ఎందుకు చేస్తున్నారన్నది వారి ప్రశ్న. అన్ని చోట్ల రాముల వారి గోత్రాన్ని వశిష్ట గోత్రంగానే చదువుతున్నారు. అయితే ఇది మద్యలో కొంత మంది మార్చి ఈ గోత్రాన్ని పలుకుతున్నారని వీరి వాదన. ఈమేరకు కోర్టును ఆశ్రయించగా, కోర్టు కూడ దేవాదాయ శాఖ కు నోటీసులను జారీ చేసింది.

గతంలో కూడా ఒకసారి శివభక్తుడైన ఓ స్వామిజి ఆలయం నుండి బయటకి వెళ్లనని ఎందుకు స్వామి వారి గోత్ర,
నామాలను మార్చి చదువుతున్నారని ఆలయ అధికారులతో పాటు, పండితులను నిలదీశారు. అంతేకాకుండా ఆలయం లోనే నిరసనకు దిగడం పెద్ద చర్చకు దారితీసింది..

అయితే కావాలని కొంత మంది ఈ వివాదానికి తెర లేపారన్నది ఇక్కడి వైదికుల ఆరోపణ.1999 నుంచి ఈ వివాదాన్ని లేవదీశారని, అసలు భద్రాచలం రామాలయం విశిష్టత కావచ్చు. ఆయన ఇక్కడ జన్మించిన విదానం కావచ్చు ఈ వివరాలు ఏమి తెలియకుండా ఆరోపణలు చేస్తున్నారని భద్రాచలం దేవస్థానం ఆచార్యులు వాదిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విదంగా భద్రాచలం రామాలయంలో స్వామి వారు ఉంటారని అంటున్నారు. ఎక్కడైన రాముల వారి ప్రతిమలు రెండు చేతులతో ఉండడం జరుగుతుంది. కానీ భద్రాచలంలో మాత్రం అలా కాదు అని చెబుతున్నారు. నాలుగు చేతులు, శంఖుచక్రాలతో కలుపుకుని, వామాంకం పై సీతమ్మ వారిని కూర్చో బెట్టుకుని స్వామి వారు ఇక్కడ వెలిశారనేది ఇక్కడి వైదిక పండితులు చెబుతున్నారు.భద్రుని తపస్సు మేరకు భద్ర కొండ మీద స్వామి వారు వైకుంఠం నుంచి భువికి దిగి వచ్చారని అంటుంటారు. అందువల్ల ఇక్కడ దశావతారాల్లో ఒకరిగా స్వామి వారిని తాము బావిస్తామని అంటున్నారు పండితులు. రాముడినే పూజిస్తాం కాని, రాముడి కుటుంబంలో ఉన్న దశరధుడిని పూజించం కద అందువల్ల రాముడి కుటుంబ గోత్రాన్ని కాకుండా, దశావతారాల్లో ఒక్కటైన రాముడి గోత్రాన్ని అచ్యుత గోత్రం చదువుతున్నట్లు చెబుతున్నారు. అయితే రామ నవమి వేడుకల్లో మొదటి నుంచి తాము రామనారాయణ అనే పదాన్ని వాడుతున్నామని , అదే విదంగా గోత్రాలు కూడ మొదటి నుంచి అచ్యుత గోత్రాన్ని వాడుతున్నట్లు ఆచార్యులు చెబుతున్నారు. కావాలని కొంత మంది వారికి తెలియని తనంతో తమ మీద ఆరోపణలు చేస్తున్నారని ఇది కరెక్టు కాదని అంటున్నారు. ఏవిషయంలోనైనా చర్చకు తాము సిద్దమేనని, భద్రాచలం రామాలయంలో రామదాసు ఎలా చేశాడో ఆయనను మాత్రమ ప్రమాణికంగా తీసుకుంటామని చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే భద్రాచలంలో రామాలయంలో వాడుతున్న అంశాలకు సంబందించి రామనారాయణుడు అనే పదంపై హైకోర్టుకు వెళ్లారు. ఈ మేరకు దేవాదాయ శాఖ భద్రాచలం రామాలయంనుంచి వివరణ కోరింది.

ఎంతో పవిత్రమైన భద్రాచలం ఆలయంలో కొలువై ఉన్న సీతారామచంద్రునిపై ఇలాంటి వివాదాలు రావడం స్వామి వారి కీర్తిని, ప్రతిష్టతలను అవమానపరిచినట్టేనని, ఆలయ గౌరవాన్ని తగ్గించినట్టవుతుందని ఇప్పటికైనా స్వామి వారిపై జరుగుతున్న వివాదాన్ని ఆపాలని పలువురు భక్తులతో పాటు, పండితులు కోరుతున్నారు.

శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అనే నానుడి ఉంది..కానీ ఎంతమందికి ఆ స్వామి రక్ష గా ఉన్నాడో తెలియదు కానీ ప్రస్తుతం ఆయనే వివాదాల్లోకి ఎక్కడంతో భక్తులు,పండితులు అంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ వారు సమస్యను పట్టించుకుని రానున్న శ్రీరామనవమి వేడుకలకు ఎలాంటి
అడ్డంకులు లేకుండా చూడాలని కోరుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *