సైకో శ్రీనివాస రెడ్డి చంపాడు...వాడు సైకో అని వదిలేద్దామా?

సైకో శ్రీనివాస రెడ్డి చంపాడు...వాడు సైకో అని వదిలేద్దామా?

హాజీపూర్ కాదు హర్రర్ పూర్. మారుమూల గ్రామం నాలుగు రోజులుగా వార్తల ప్రధాన శీర్షికల్లో ఉంది. కారణం..ముక్కుపచ్చలారని అమ్మాయిల హత్యలు.
ఇది ఓ సైకో చేసిన పాపమా లేక..70 ఏళ్లుగా ప్రభుత్వాలు చేసిన పాపమా?. ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని మందలించాలి?. తప్పు ఎవరిది? పాపం ఎవరిది?
అమ్మాయిల హత్యలకు బాధ్యత వహించేది ఎవరు?. హాజీపూర్ హర్రర్‌ … పోలీసులు చెప్పనని నిజాలు మోజో చెబుతోంది.

గుండె తరుక్కు పోతుంది. నోట మాట రావడం లేదు. ఎంతో భవిష్యత్తున్న పాపలు చంపబడ్డారని తెలిసి గుండెలు రోదిస్తుంటే..ఏడ్చిఏడ్చి కళ్లల్లో నీళ్లు కూడా రావడం మానేశాయి. హైదరాబాద్ కు 50 కిలో మీటర్ల లోపలే ఉన్న ఓ విలేజ్‌లో సీరియల్ హత్యలు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేశాయి.

ముగ్గురు ఆడపిల్లల ప్రాణాలు పోవడానికి కారకులు ఎవరు?. సైకో శ్రీనివాస రెడ్డి చంపాడు…వాడు సైకో అని వదిలేద్దామా?. శ్రీనివాసరెడ్డి నేరప్రవృత్తి కలవాడని తెలిసి పోలీసులు నిఘా పెట్టకపోవడాన్ని ఎలా చూడాలి?. కర్ణాటక, కర్నూలు, వరంగల్‌లో హత్యలు చేసి స్వగ్రామం హాజీపూర్‌ వచ్చి ముగ్గురు అమ్మాయిలను చంపితే పోలీస్ వ్యవస్థ ఏం చే స్తుంది?. శ్రీనివాస రెడ్డి ఉన్న గ్రామంలో అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదవుతుంటే..పోలీస్‌ బాస్‌లు ఏం చేస్తున్నారు?. ముగ్గురు అమ్మాయిల ప్రాణాలు పోవడానికి శ్రీనివాస రెడ్డే కారణమని అనుకుందామా?. అశ్రద్ధగా ఉన్న పోలీసులు అనుకుందామా?. ముగ్గురు అమ్మాయిలను చంపింది శ్రీనివాస రెడ్డేనా…పోలీసుల నిర్లక్ష్యం కూడా వారి ప్రాణాలు పోవడానికి కారణమైందీ?. ఇక్కడ శ్రీనివాస రెడ్డి, పోలీసులే కాదు..ముగ్గురు అమ్మాయిల హత్యలకు కారణం ఏంటని మోజో పరిశోధించినప్పుడు నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి.

ముగ్గురు అమాయిక అమ్మాయిల హత్యలకు 70ఏళ్లుగా పాలించిన ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తుంది మోజో. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తరువాత కూడా బస్సు సౌకర్యంలేదంటే ఇప్పటిదాకా పాలించిన పాలకులు ఏమని సమాధానం చెప్పుకోగలరు?. మోజో పరిశోధనలో తేలిందేమంటే…హాజీపూర్‌ గ్రామానికి ఒకప్పుడు బస్ సౌకర్యం ఉండేది…ఇప్పుడు లేదు. లాభాలు రావడంలేదని బస్సును తీసేశారట!. ఆర్టీసీ లాభాపేక్ష ఇ ప్పుడు ముగ్గురు అమ్మాయిల హత్యలకు కారణమైందీ. ఆర్టీసీకి, ప్రభుత్వాలకు లాభాలు ముఖ్యమా..ప్రజల మాన,ప్రాణాలు ముఖ్యమా?. ఈ విషయంలో రష్యా, జపాన్‌ , దక్షిణ కొరియా దేశాల నుంచి మన పాలకులు, అధికారులు ఎందుకు పాఠాలు నేర్చుకోరు.

హాజీపూర్‌ లాంటి చిన్న మారుమూల గ్రామంలో అమ్మాయిలను చదివించడమే ఎక్కువ. అటువంటి గ్రామం అమ్మాయిలు సొంత గ్రామంలో చదువుకోవడానికి అవకాశంలేక…పక్క ఊళ్లో చదువుకుంటుంటే గ్రామపెద్దలు, పోలీసులు, పాలకులు ఎంత జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ అందరి తప్పు కొట్టుకొచ్చినట్లు కనిపిస్తోంది. ముగ్గురు అమ్మాయిల హత్యలకు పాలకులు, పోలీసులు, గ్రామపెద్దలు బాధ్యత వహించాలి. ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే గొంగడి సునీత స్పాట్‌కు వెళ్లకుండా..హైదరాబాద్‌లో ఉ న్నారంటే…ఎంత వరకు బాధ్యతాయుతంగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఏ ఇంటి అమ్మాయైనా మనింటి అమ్మాయి అనుకోవాలి..అప్పుడే సమాజంలో బాధ్యత పెరిగి ఇటువంటి దురాగతలు ఆగుతాయి. పాలకుల్లారా ఇప్పటికైనా మేల్కోండి. ఇప్పటికైనా హాజీపూర్ కు బస్సు వేయండి. ఇదే మోజో డిమాండ్. హాజీపూర్ లో బస్సు స్టాప్ నిర్మించాలి. ఆ బస్టాప్ కు కల్పన – శ్రావణి – మనీషా పేరు పెట్టండి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *