కోల్‌కతా నైట్‌రైడర్స్‌ VS కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ VS కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌

ఐపీఎల్‌ 2019 సీజన్‌ మొదలైంది.ఎన్నికల వేడి ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడుస్తోంది.ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి.2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న ఆరో మ్యాచ్‌లో కోల్‌కతా వేదికగా ఈ రోజు కోల్‌కతా నైట్‌రైడర్స్‌,కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌ తలపడున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో మీకోసం మోజో అంచనా వేస్తోంది.దానిలో భాగంగానే ఈ రోజు ప్రెడిక్షన్‌

మోజో ప్రెడిక్షన్‌… 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌, కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌  కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియంలో తలపడనున్నాయి.ఈ గ్రౌండ్‌ టూ పేసెడ్‌గా ఉంటుంది.ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌ అధిపత్యమే ఉంటుంది.170 పైచిలుకు పరుగులతో మ్యాచ్‌ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.ఒక్క హిట్టర్‌ నిలదొక్కుకున్నా భారీ స్కోర్‌లు చూడొచ్చు.సీమర్లతో పోల్చితే స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది.సొంతమైదానం కావడం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం.

170 దాటినా కష్టమే 

టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.పిచ్‌ స్వభావాన్ని బట్టి స్కోర్‌బోర్డ్‌ మీద మంచి స్కోర్‌లే కనిపిస్తాయి.ఎవరు మొదటి బ్యాటింగ్‌ చేసినా… 170 పరుగులపైనే సాధించే అవకాశం ఉంది.180 పరుగుల టార్గెట్‌ ఉన్నా…సులభంగానే చేరుకునే విధంగా పిచ్ సహకరిస్తుంది.ఎంత భారీ స్కోర్‌ నమోదు చేసినా…ప్రత్యర్థి జట్టుకు ఛేజ్‌ చేసే అవకాశం ఉంది.సొంతమైదానం కావడం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం.మోజో విశ్లేషకుల అంచనా ప్రకారం విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు కోల్‌కతాకే ఉన్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *