ఎందుకిలా..శ్రీలంకపై పగ బట్టారు

ఎందుకిలా..శ్రీలంకపై పగ బట్టారు

శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది. ఓవైపు భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నారు.. మరోవైపు బాంబులు పేలుతూనే ఉన్నాయి. తాజాగా కల్మునాయ్ ప్రాంతంలో మరో మూడు చోట్ల బాంబులు పేలాయి. మరి ఇంతలా ఉగ్రవాదులు దాడులకు తెగబడటం వెనుక కారణాలేంటి..? అసలు దాడులకు పాల్పడుతుందేవరు..? .ఇప్పుడివే ప్రశ్నలు శ్రీలంక ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇస్టర్న్ డే నాడు వరుస బాంబు పేలుళ్లకు శ్రీలంక అతులాకుతులం అయింది. లంకలోని చర్చ్‌లు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా భీకరమైన బాంబు దాడులు జరిగిన దుర్ఘటనలో ఇప్పటి వరకు 359 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిలో 375 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. తాజాగా స్థానిక సవోయ్ థియేటర్ వద్ద ఉగ్రవాదులు డియో బైక్‌లో బాంబులు అమర్చి పేల్చేశారు. అయితే ఎల్టీటీఈ తిరుగుబాటు అణచివేత అనంతరం ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో ఒక్కసారిగా బాంబుదాడులు ఎందుకు జరిగాయి? స్థానిక ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ ఎందుకు ఇంత తీవ్రమైన ఆత్మాహుతి, బాంబు దాడులకు తెగబడింది? అన్నది ప్రస్తుతం అందరినీ కలిచి వేస్తోన్న ప్రశ్న.

మరో వైపు లంకలో మళ్లీ పేలుళ్లు సంభవించాయి. కల్మునాయ్ ప్రాంతంలో మూడు చోట్ల బాంబులు పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ పేలుళ్లలో ఎవ్వరూ గాయపడలేదు. ఈస్టర్ సందర్భంగా జరిగిన పేలుళ్ల కేసులో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ పేలుళ్లు జరిగాయి. కల్మునాయ్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దుస్తులు, ఐసిస్ జెండాలు, 150 జిలెటిన్ స్టిక్స్, లక్ష చిన్నసైజు ఇనుప గుండ్లు, డ్రోన్ కెమెరా లభ్యమయ్యాయి.ఏప్రిల్ 21న కొలంబో సహా అనేక ప్రాంతాల్లో జరిగిన ఎనిమిది పేలుళ్లలో 250మందికి పైగా చనిపోయారు. 500మంది గాయపడ్డారు. పేలుళ్లకు తమదే బాధ్యత అని ఐసిస్ ప్రకటించుకుంది. దేశంలో ఐసిస్ కోసం పనిచేసే స్లీపర్ సెల్స్ మరిన్ని దాడులకు తెగబడే అవకాశం ఉందని శ్రీలంక ఇంటలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.

మరోవైపు న్యూజిలాండ్‌లోని మసీదుల్లో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఇస్లామిక్‌ ఉగ్రవాదులు శ్రీలంకలో బాంబు దాడులు జరిపారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి రువాన్‌ విజేవర్దనే తెలిపారు. అందుకు ప్రతీకారంగా శ్రీలంకలో దాడులు జరిగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. అయితే ఐసీస్ కూడా శ్రీలంకలో దాడులు చేసింది తామే ప్రకటించింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడి, పేలుళ్లకు కారణమైన ఏడుగురు దుండగుల్లో ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్తల కుమారులు ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న భారత నిఘా వర్గంలోని అధికారులు ఈ విషయాన్ని తమకు విశ్వసనీయంగా తెలిపినట్లు వెల్లడించింది. ఈ అన్నదమ్ములు కొలంబోలోని సిన్నమన్‌ గ్రాండ్‌, షాంగ్రీ-లా హోటళ్లలో పేలుళ్లు జరిపారని తెలిపారు. ఈ ఇద్దరూ హోటళ్లలోకి మందుగుండు పదార్థాలతో నిండిన బ్యాగులతో ప్రవేశించి బాంబులను పేల్చి ఉంటారని ప్రకటించింది.

ఇక నెగొంబోలోని సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చిలో సరిగ్గా బాంబు పేలడానికి కొద్ది సమయం ముందు ఓ వ్యక్తి భారీ బ్యాగుతోలోపలికి రావడాన్ని సీసీటీవీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి చర్చిలోకి వచ్చిన తర్వాత, బాంబుపేలడానికి ముందు నుంచి సీసీటీవీ కెమెరా పనిచేయడం ఆగిపోయింది. ఆ వ్యక్తే ఆత్మహుతిదాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే ఏది ఏమైనా శ్రీలంకలో బాంబు దాడులు జరుగవచ్చని మొదటినుంచి నిఘా వర్గాలు చెబుతువచ్చినప్పటికి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే ఇన్ని దాడులు జరిగాయని సర్వత్రా విమర్శలు వ్యక్త మవుతున్నాయి. అయితే ఐసీస్ మరొసారి బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసిందని అమెరికా నిఘా వర్గాలు సమాచారం ఇచ్చిన్పటికి సవోయ్ థియేటర్ ఎదుట పేలుడును అడ్డుకోలేకపోయింది.

మొత్తానికి వరస బాంబు పేలుళ్లతో సతమతం అవుతున్న శ్రీలంక వాసులు …ఎప్పుడు ఎక్కడ నుంచి బాంబులు పేలుతాయోమోనని భయాందోళనకు గురవుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *