మోహన్‌బాబు అరుదైన రికార్డ్...నలభై ఏళ్లలో ఇది రెండోసారి!

మోహన్‌బాబు అరుదైన రికార్డ్...నలభై ఏళ్లలో ఇది రెండోసారి!

కలెక్షన్ కింగ్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్న మోహన్‌ బాబుకి విలక్షణ నటుడిగా మంచి పేరు ఉంది. అంతే కాకుండా తన సూటిదనంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా కూడా గుర్తింపు సంపాదించారు. విలన్‌గా, హీరోగా, ప్రత్యేకమైన పాత్రలను చేసి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన మోహన్ బాబు.. ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పొలిటికల్ టర్న్ తీసుకున్నారు.

ఇక తాజాగా.. మళ్లీ సినిమాల్లో సత్తా చాటేందుకు మోహన్ బాబు ప్లాన్ రెడీ చేస్తున్నారు. తమిళ హీరో సూర్య సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు మోహన్ బాబు. ‘గురు’ చిత్రంతో దర్శకురాలుగా సత్తా చాటిని మణిరత్నం శిష్యురాలు సుధ కొంగర.. కొన్నాళ్ల గ్యాప్ తరువాత సూర్య హీరోగా ‘సూరరై పోట్రు’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా మోహన్‌బాబు నటించబోతున్నారు.

ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే… మోహన్ బాబు 44 ఏళ్ల సినిమా జీవితంలో ఓ మహిళా దర్శకురాలుతో పనిచేయడం ఇది రెండోసారే. గతంలో విజయ నిర్మల దర్శకత్వంలో పనిచేసిన ఆయన.. మళ్లీ 40 ఏళ్ల తరువాత సుధ కొంగరతో పనిచేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తి కాగా.. మోహన్ బాబు‌ కాంబినేషన్ షాట్స్‌ను ఈ మధ్యనే మొదలుపెట్టారు. ఇప్పటికే మోహన్ బాబు ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నైకి బయలుదేరారు. ఈ సినిమా సూర్యకు 38వది కాగా ఆయనే సొంతంగా నిర్మిస్తుండటం విశేషం. ఇండియన్ ఆర్మీ మాజీ కెప్టెన్, ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు అయిన వ్యాపారవేత్త జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *