వివాదంలో ష‌మీ! అపరిచిత మ‌హిళ‌కు మెసేజ్‌..

వివాదంలో ష‌మీ! అపరిచిత మ‌హిళ‌కు మెసేజ్‌..

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో రాణిస్తున్న పేసర్‌ మహ్మద్‌ షమీ మళ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే అతని భార్య హసీన్‌ జహాన్‌ షమీ స్త్రీలోలుడని, అదనపు కట్నం కోసం తనను వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది.ఈ వ్యవహారంలో షమీపై పోలీసులు చార్జ్‌షీట్‌ కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో షమీకి కాంట్రాక్ట్‌ నిరాకరించిన బీసీసీఐ.. విచారణ జరిపి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. దీంతో ఆటలో మరింత రాటుదేలిన షమీ టీమిండియా వరుస విజయాల్లో భాగమయ్యాడు.

అయితే ఈ తరహాలోనే..ఏ మాత్రం పరిచయం లేని షమీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తనకు పదేపదే మెసేజ్‌లు పంపిస్తున్నాడని..సోఫియా అనే మహిళ ఆరోపించింది. అయితే షమీ సదరు మహిళకు ‘గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌’ అని మెసేజ్‌ చేసినట్లు ఆ స్క్రీన్‌ షాట్స్‌లో ఉంది. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్‌ క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే కొందరు షమీ చేసిన మెసేజ్‌లో తప్పేం ఉందని ప్రశ్నిస్తే.. మరికొందరు అతను నిజంగా స్త్రీలోలుడేనని తప్పుబడుతున్నారు.

ఇక ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన షమీ 14 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించి ఔరా అనిపించాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్‌ ఓడినప్పటికి షమీ 5 వికెట్ల ఫీట్‌ను అందించి తన సత్తా చాటుకున్నాడు. అయితే . అయితే కీలక సెమీఫైనల్‌ మ్యాచ్‌కు షమీని పక్కన బెట్టడంపై మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ విశ్లేషకులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *