అద్వాణీపై మోదీ-షా రాజకీయ వ్యూహం

అద్వాణీపై మోదీ-షా రాజకీయ వ్యూహం

ఎల్ కే అద్వాణీ…భారతదేశ రాజకీయాల్లో ఎంతో గొప్ప పేరున్న నాయకుడు.సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత.అద్వాణీ ప్రస్తుతం బీజేపీ ప్రకటించిన 184 మంది అభ్యర్థుల్లో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి అద్వాణీ పేరు కనిపించలేదు.ఇక్కడి నుంచి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేరు తెరపైకి వచ్చింది.అయితే గత 25 ఏళ్లుగా గాంధీ నగర్ నియోజకవర్గం నుంచి అద్వాణీ పోటీ చేస్తూ వస్తున్నారు.అంతేకాదు పోటీచేసిన ప్రతిసారి అఖండ మెజార్టీతో లోక్‌సభలో అడుగుపెట్టారు.ఈ సారి ప్రకటించిన అభ్యర్థుల్లో గాంధీనగర్‌ నియోజకవర్గం నుంచి జాబితాలో అద్వాణీకి చోటు దక్కకపోవడంతో ఆయన రాజకీయ చరిత్ర చివరి దశకు చేరుకుందనే భావించాలి.

వాజ్‌పేయి ప్రభుత్వంలో ఉపప్రధానిగానూ,కేంద్ర హోంశాఖ మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు.ఎలాంటి పరిస్థితులనైనా సానుకూలంగా తీసుకోగల మనస్తత్వం ఈ ఉక్కుమనిషికి ఉంది.వాజ్‌పేయికి ఉదారవాది అని పేరుంటే, అద్వాణీకి హిందూత్వవాదిగా ముద్రపడింది.అంతేకాదు వివాదాస్పదమైన నాయకుడు అనే అభిప్రాయం కూడా ఉంది.

ఒకప్పుడు అద్వాణీ బీజేపీని తన భుజస్కంధాలపై మోసుకు వచ్చాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.ఇప్పుడు ఆయన్ను పార్టీలో ఒక సాధారణ కార్యకర్తలా పరిగణించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.అంతేకాదు సీనియర్లను మోదీ,షా ద్వయం పక్కన పెడుతోందనే అసంతృప్తిలో అద్వాణీ ఉన్నట్లు సమాచారం.గత ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రపతిగా తనను పంపుతారని అద్వాణీ ఆశలు పెట్టుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు.కొన్ని రాజకీయ/సామాజిక సమీకరణాల నేపథ్యంలో అనూహ్యంగా రామ్‌నాథ్ కోవింద్ పేరు తెరపైకొచ్చింది.ఇక ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తే తనను రాష్ట్రపతిని చేస్తారనే చిన్న ఆశ ఏదో మూలన అద్వాణీకి ఉంది.అయితే మోదీని చూస్తే అద్వాణీ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దగ్గరి నుంచే అద్వాణీకి పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు.ఎప్పుడూ సమస్యలపై అనర్గళంగా మాట్లాడే అద్వాణీ ఈసారి ఎంపీగా ఉన్న ఆయన సభలో కేవలం 365 పదాలు మాత్రమే మాట్లాడారంటే ఈ రాజకీయ భీష్ముడికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *