బీజేపీ ఎంపీల 'పాదయాత్ర'

బీజేపీ ఎంపీల 'పాదయాత్ర'

పాదయాత్ర అనేది…ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు చక్కటి ప్లాట్ ఫాం. పాదయాత్ర ద్వారానే ఏపీలో వైఎస్ఆర్, ఆ తర్వాత చంద్రబాబు, మొన్న వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్‌తో పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే, ఇప్పుడు బీజేపీ దేశవ్యాప్త పాదయాత్రకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలంతా 150 కిలో మీట‌ర్ల మేర పాద‌యాత్ర చేయాల‌ని ప్రధానమంత్రి నిర్దేశించారు. జాతిపిత మహాత్మగాంధీ 150జయంతిని పురస్కరించుకొని 150 కిలోమీటర్ల పాదయాత్రకు ప్లాన్ చేశారు.

మ‌హాత్మా గాంధీ జ‌యంతి రోజైన అక్టోబ‌ర్ 2 నుంచి…. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ పటేల్ జ‌యంతి అక్టోబ‌ర్ 31 వ‌ర‌కూ ఈ పాద‌యాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ యాత్ర ద్వారా గ్రామాల్లో ప్రజలను క‌ల‌వాల‌న్నది ప్రధాని లక్ష్యంగా కనిపిస్తోంది. గ్రామాల్లో స్వయం పాలన, మొక్కలు నాటడం, బడ్జెట్ పద్దులపై తదితర అంశాలను పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరించనున్నారు. రోజుకి 15 కిలోమీటర్ల చొప్పున 150 కిలోమీటర్లు న‌డ‌వాలని మోదీ ఎంపీలకు సూచించారు. బీజేపీ ఎంపీలు లేని ప్రాంతాల్లో రాజ్యస‌భ స‌భ్యులు, పార్టీ నాయ‌కులు యాత్రలు చేయాల‌ని మోదీ ఆదేశించారు. మ‌హాత్మా గాంధీ ఆలోచ‌నా విధానాన్ని ఈ యాత్ర ద్వారా ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ప్రధాని చెప్పారు.

మామూలుగా ఏ పార్టీ అయినా ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర చేపడుతుంది. కానీ, ఇప్పుడు ఎన్నికలయిపోయాయి. బీజేపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయినా పాదయాత్రకు బీజేపీ ప్లాన్ చేయడం వెనుక మాస్టర్ ప్లానే ఉందంటున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్… ప్రధానంగా రెండు అంశాలపైనే దృష్టిసారించినట్లు తెలుస్తోంది. గాంధీ 150వ జయంతి, జమిలీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు మోదీ ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు. మహాత్మగాంధీ జయంతిని ఘనంగా చేయడంతో పాటు…2022లో భారతతేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది. ఆ వేడుకలను అట్టహాసంగా నిర్వహించి, ఒకే దేశం ఒకే ఎన్నికల విధానానికి శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేస్తున్నారట.

గాంధీ సిద్ధాంతాలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంగా ఉండేది. ఆ అభిప్రాయాన్ని మార్చాల‌నే ప్రయ‌త్నంలో బీజేపీ ఉన్నట్టుగా క‌నిపిస్తోంది. తాజా బ‌డ్జెట్లో గాంధీ సిద్ధాంతాల‌కు అనుగుణంగా, గ్రామీణ భార‌తంపై శ్రద్ధ పెట్టినట్టు ఆ పార్టీ నేతలు చెప్పుకున్నారు. గత ప్రభుత్వ హ‌యాంలో సర్దార్ వల్లాభాయిపటేల్‌ను ప్రొజెక్ట్ చేసే ప్రయ‌త్నం చేశారు. గుజ‌రాత్‌లో నర్మదా నదీ తీరాన భారీ పటేల్ విగ్రహం పెట్టారు. గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం ద‌గ్గర్నుంచీ… ఆయ‌న సిద్ధాంతాల‌ు, ఆశయాలకు తామే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామ‌నే ఇమేజ్ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందట.

మొన్న తెలంగాణ.. నేడు కర్ణాటక.. ఇలా కాంగ్రెస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా గోవా! తెలంగాణలో ఆ మధ్య సీఎల్పీని తెరాసలో విలీనం చేయగా.. కర్ణాటకలో రెబల్స్‌ కారణంగా కాంగ్రెస్‌- జేడీఎస్‌ ప్రభుత్వం ప్రస్తుతం సంక్షోభంలో పడింది. ఇప్పుడు గోవాలోనూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు చీలిక వర్గంగా ఏర్పడి అధికార భాజపాలో శాసనసభాపక్షం విలీనం చేయాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ సమర్పించారు. ప్రతిపక్ష నేత చంద్రకాంత్‌ కవలేఖర్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం బుధవారం సాయంత్రం స్పీకర్‌ను కలిసింది. ఈ విషయాన్ని స్పీకర్‌ సైతం ధ్రువీకరించారు. భాజపా బలం పెరిగినట్లు అటు సీఎం కూడా లేఖ ఇచ్చినట్లు స్పీకర్‌ తెలిపారు.

దీంతో కాంగ్రెస్‌ పార్టీకి మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. 2017లో గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి తలెత్తడం గమనార్హం. మరోవైపు వీరి చేరికతో భాజపా ప్రభుత్వ బలం 27కి చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న గోవా ఫార్వర్డ్‌ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం విజయ్‌ సర్దేశాయ్‌ సహా ఇతర మంత్రులకు చరమగీతం పాడాలని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *