'బస్సు' దొంగలున్నారు జాగ్రత్త

'బస్సు' దొంగలున్నారు జాగ్రత్త

పిల్లల కిడ్నాప్ లు చూశాం.. విమానాల హైజాక్ లూ చూశాం.. కానీ ఇప్పుడో చిత్రమైన చోరీని మీకు చూపించబోతున్నాం.. సినిమాల్లో తప్ప ఇలాంటి చోరీ మరెక్కడా చూసి ఉండరు..

ఉదయం నుంచి కుషాయిగూడ టు అఫ్జల్ గంజ్ షటిల్ సర్వీస్ చేసి అలిసిపోయిన ఆ ఇద్దరూ వెహికల్ ను పార్క్ చేశారు.. ఓ సారి చుట్టూ పరిసరాలను గమనించి అక్కడి నుంచి కదిలి రెస్ట్ రూమ్ కు వెళ్ళిపోయారు.. తెల్లారి లేచి రెడీ అయ్యి.. రాత్రి వెహికల్ పార్క్ చేసిన చోటికి వచ్చి షాక్ తిన్నారు.. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.. అక్కడ ఉండాల్సిన తమ వెహికల్ కనిపించలేదు.. మొత్తం కలియతిరిగారు.. అయినా ఆనవాలు కనిపెట్టలేకపోయారు.. చేసేదేం లేక పోలీసుల దగ్గరికి పోయారు..సార్.. మా బండి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.. పోలీసులు కూడా ఏ బండి..కంపెనీ ఏదీ? కలరేంటి? విత్ గేర్సా, వితవుటా? అంటూ రెగ్యులర్ గా ప్రశ్నలు సంధించారు.. అసలే వెహికల్ పోయిన షాక్ లో ఉన్న ఆ ఇద్దరూ పోలీసుల ప్రశ్నలకు మరింత విస్తు పోయారు.. బండి అంటే టూ వీలర్ కాదు సర్.. ఆర్టీసి బస్ అని తాపీగా చెప్పారు.. ఇప్పుడు షాక్ తినడం పోలీసుల వంతైంది..

ఎంతో సేపటికి తేరుకున్న పోలీసులు.. బస్ మిస్సవ్వడమేంటి? అని టోపీలు తీసి బుర్ర గోక్కున్నారు.. వెంటనే ఎంక్వయిరీ మొదలెట్టారు..రాత్రి 11 గంటలకు డిపోలో పార్క్ చేసిన బస్ ను 12 గంటల ప్రాంతంలో ఎవరో డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళినట్టు అక్కడి సీసీటీవీ లో రికార్డయ్యింది. రాత్రి పూట కావటంతో తీసుకెళ్ళిన వారి ముఖాలను గుర్తు పట్టలేకపోయారు.

AP11Z 6254 నెంబర్ గల ఆ ఆర్టీసీ బస్ రాత్రి 1 గంట టైమ్ లో తూప్రాన్ దగ్గర టోల్ గేట్ దాటినట్లు రికార్డయ్యింది. నాందేడ్ రూట్ లో బస్ వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు . ఎట్టకేలకు బస్సు ఆచూకీని గురువారం పోలీసులు కనుగొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ దగ్గర ఒక ఫౌండ్రీలో ఆ బస్సు భాగాలను వేరుచేసి, ముక్కలుగా స్క్రాప్ చేస్తుండగా గుర్తించారు. కానీ ఆచూకీ కనుక్కునే సరికే బస్సు ముక్కలైపోయింది. ఏ పార్టుకు ఆ పార్టు విడదీసేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *