మీరాభాయ్‌, కోహ్లీలకు ఖేల్‌రత్న

మీరాభాయ్‌, కోహ్లీలకు ఖేల్‌రత్న

క్రీడా పురస్కారాలకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. జీవితం మొత్తాన్నీ ఆటలకే అప్పగించి, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని గౌరవించుకోడానికీ వీలుంటుంది. అవి వారికీ ఆనందాన్నిస్తాయి. మరింత వేగంగా ముందుకెళ్లడానికి బలాన్నిస్తాయి. తాము దేశం కోసం ఆడుతన్నట్టే, దేశమూ తమ పక్క నలబడిందన్న భరోసా ఉంటుంది. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే… వీటికి క్రేజ్‌ కూడా బానే ఉంది. కోట్ల మంది అభిమానులున్న ఆటగాళ్లైనా, క్రీడా పురస్కారలతో సంబరపడిపోతారు. ఈ పురస్కారలు క్రీడాకారులకే కాదు, వారి గురువులకూ ఉంటాయి. వాటిని ద్రోణాచార్య అవార్డు పేరుతో అందిస్తారు. ఈ సంవత్సరానికి సంబంధించిన క్రీడా పురస్కారలను ఈరోజే కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. ఈ పురస్కారాలు ఎవరెవరిని వరించాయో ఓ లుక్కేసొద్దాం పదండి

ఒప్పుకుని తీరాలి…

కొన్ని వాస్తవాలను ఒప్పుకుని తీరాలి. మనదేశంలో ఎన్నో క్రీడలున్నా… క్రికెట్‌కే అధిక ప్రాధాన్యతుంటుంది. అన్ని క్రీడల్లోని ఆటగాళ్లకూ అవార్డులు ప్రకటించినా… అందరు కళ్లూ క్రికెటర్ల మీదే ఉంటాయి. ఇందులో మరో నిరాశపరచే విషయమేమంటే… అంత ప్రాధాన్యతా మెన్స్‌ క్రికెట్‌కే ఉంటుంది. ఈ తీరు త్వరలోనే మారిపోయి, అందరికీ ఒకేలాంటి ప్రాధాన్యత వస్తే… అందరికీ సముచిన స్థానం ఇచ్చిన వాళ్లమవుతాం.

ప్రకటించారు…

రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న, ద్రోణాచార్య అవార్డు, అర్జున అవార్డు, ధ్యాన్‌చంద్‌ అవార్డులు ఎవరెవరి వరించాయో… ఈ రోజే క్రీడాశాఖ ప్రకటించింది. ఈ నెల 25న రాష్ర్టపతి చేతుల మీదగా వారు అవార్డులను అందుకుంటారు. అవార్డులతో పాటుగా ఖేల్‌రత్న పురస్కార గ్రహీతలకు 7.5 లక్షలూ, ద్రోణాచార్య , అర్జున, ధ్యాన్‌చంద్‌ అవార్డు గ్రహీతలకు 5 లక్షల నగదు బహుమతినీ అందిస్తారు.

ఈ ఏడాది అవార్డుల వీరివే…

రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న:

1. విరాట్‌ కోహ్లీ – (క్రికెట్‌)
2. మీరాబాయి ఛాను – (వెయిట్‌లిఫ్టింగ్‌)

ద్రోణాచార్య అవార్డు:

1. తారక్‌ సిన్హా – క్రికెట్‌(లైఫ్‌టైమ్‌)
2. వీఆర్‌ బీడు – అథ్లెటిక్స్‌(లైఫ్‌టైమ్‌)
3. సుఖ్‌దేవ్‌ సింగ్‌ పన్ను – అథ్లెటిక్స్‌
4. క్లారెన్స్‌ లోబో – హాకీ(లైఫ్‌టైమ్‌)
5. ఎ. శ్రీనివాసరావు – టేబుల్‌ టెన్నిస్‌
6. విజయ్‌ శర్మ – వెయిట్‌లిఫ్టింగ్‌
7. జీవన్‌ కుమార్‌ శర్మ – జూడో(లైఫ్‌టైమ్‌)
8. సుబేదార్‌ చెనంద అచ్చయ్య కట్టప్ప – బాక్సింగ్‌

అర్జున అవార్డు:

1. సుబేదార్‌ జిన్సన్‌ జాన్సన్‌ – అథ్లెటిక్స్‌
2. నీరజ్‌ చోప్రా – అథ్లెటిక్స్‌
3. శుభాంకర్‌ శర్మ – గోల్ఫ్ 13. మనికా బత్రా – టేబుల్‌ టెన్నిస్‌
4. సతియాన్‌ – టేబుల్‌ టెన్నిస్‌
5. ఎన్‌. సిక్కీరెడ్డి – బ్యాడ్మింటన్‌
6. మనోజ్‌ సర్కార్‌ – పారా బ్యాడ్మింటన్‌
7. అంకుర్‌ మిట్టల్‌ – షూటింగ్‌
8. హిమా దాస్‌ – అథ్లెటిక్స్‌
9. సుబేదార్‌ సతీశ్‌ కుమార్‌ – బాక్సింగ్‌
10. స్మృతి మంధాన – క్రికెట్‌
11. రోహన్‌ బోపన్న – టెన్నిస్‌
12. సుమిత్‌ – రెజ్లింగ్
13. పూజా కడియన్‌ – వుషు
14. సవిత – హాకీ
15. కల్నల్ రవి రాథోడ్‌ – పోలో
16. మన్‌ప్రీత్‌ సింగ్‌ – హాకీ
17. రహీ సర్నోబత్‌ – షూటింగ్‌
18. శ్రేయాసి సింగ్‌ – షూటింగ్‌
19. అంకుర్‌ ధమా – పారా అథ్లెటిక్స్‌
20. మనికా బత్రా – టేబుల్‌ టెన్నిస్‌

ధ్యాన్‌చంద్‌ అవార్డు:

1. భరత్‌ కుమార్‌ ఛెత్రీ – హాకీ
2.సత్యదేవ్‌ ప్రసాద్‌ – ఆర్చరీ
3. చౌగలే దాదు దత్తాత్రేయ – రెజ్లింగ్‌
4. బాబీ అలోయ్‌సియస్‌ – అథ్లెటిక్స్‌

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *