హైదరాబాద్ లో యువకుల పైశాచికత్వం

హైదరాబాద్ లో యువకుల పైశాచికత్వం

హైదరాబాద్‌ దారుణం చోటుచేసుకుంది. మైసమ్మగూడకు చెందిన మైనర్ బాలికకు అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్లు కొంతకాలంగా గంజాయి అలవాటు చేశారు.ఈ క్రమంలో బాలికను లోయర్ ట్యాంక్ బండ్ డీబీఆర్‌ మిల్స్ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం అందరూ గంజాయి సేవించారు.ఆ తర్వాత అందులోని ఆ మైనర్‌ ఆమెను వివస్త్రను చేసి ఒంటిపై బ్లేడుతో దాడి చేశాడు.అంతే కాకుండా ఈ దాడిని సెల్‌ఫోన్లో రికార్డు చేశాడు. ఆ బాలిక ఎంత బతిమాలినా వదల్లేదు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న ఆ బాలికను స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్పించారు.ఆ బాలుడితో పాటు అతడి స్నేహితులకు దేహశుద్ధి చేసి గాంధీనగర్ పోలీసులుకు అప్పగించారు. బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.ప్రస్తుతం బాలిక ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *