కేంద్రంలో తెలుగు మంత్రులు...!?

కేంద్రంలో తెలుగు మంత్రులు...!?

కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేత్రుత్వంలోని కొత్త ప్రభుత్వంలో తెలుగు వారికి అవకాశం రానుందా… ? దక్షిణాది రాష్ట్రాలలో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులకు మంత్రులగా అవకాశం ఇస్తుందా అంటే…అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్దానాలను కైవసం చేసుకుంది. ఇది ఆ పార్టీ పెద్దలూ ఊహించలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఆగ్రహాన్ని చవిచూసింది. అయితే అటు ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇటు తెలంగాణలోనూ విస్తరించాలనుకుంటున్న బీజేపీ… ఈ రెండు రాష్ట్రాలకూ చెందిన నాయకులకు మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశం ఉందంటున్నారు.

వీళ్ళకి పదవులు…

తెలంగాణలో విజయం సాధించిన ఎంపీలలో కిషన్ రెడ్డి సీనియర్ నాయకుడు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ సమీకరణాలు సరిపోలకపోతే అదిలాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన సోయం బాబురావును మంత్రి పదవి వరించే అవకాశం ఉందంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే గిరిజనుల్లో పార్టీ పటిష్టమవుతుందన్నది అదిష్టానం వ్యూహంగా చెబుతున్నారు. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ దారుణమైన దెబ్బతింది. అక్కడ పార్టీని పటిష్టపరచాలంటే ఒకరిని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవాలని బిజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే పార్టీ ప్రధాన కార్యదర్శ, ఆంధ్రప్రదేశ్కి చెందిన వారణాసి రాంమాధవకు మంత్రిపదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాంమాధవకు బిజేపీ అధిష్టానంతో పాటు ఆర్ఎస్ఎస్ అండదండలూ ఉన్నాయి. ఒక దశలో మిత్రుల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే ప్రధానిగా గట్కరీతో పాటు రాంమాధవ్ పేరూ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పూర్తి స్ధాయి మెజారిటీ రావడంతో నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారు. ఆయన మంత్రి వర్గంలో రాంమాధవకు క్యాబినెట్ హోదాలో కీలకమైన పదవి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *