మినీ బస్సు బోల్తా..15 మందికి గాయాలు..

మినీ బస్సు బోల్తా..15 మందికి గాయాలు..

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద ఓ మినీబస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో దాదాపు 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి నాలుగు తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు బస్సులో 28 మంది ఉండగా.. 15 మంది గాయాలపాలయ్యారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *