సైలెన్స్ కోసం సన్నబడుతున్న అనుష్క

సైలెన్స్ కోసం సన్నబడుతున్న అనుష్క

భాగమతి తర్వాత దేవసేన అనుష్క నుంచి మరో మూవీ రాలేదు.దాదాపు ఏడాది తర్వాత కోనా వెంకట్ నిర్మిస్తున్న సైలెన్స్ అనే సినిమాలో మాధవన్ పక్కన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో క్వింటిన్ టోరంటినో ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన కిల్ బిల్,హేట్ ఫుల్ ఎయిట్,రిస‌ర్వోయ‌ర్ డాగ్స్ చిత్రాల్లో న‌టించిన హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ‌స‌న్ ఒక స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు.nushka shetty michael madsenసైలెన్స్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులంద‌ర్నీ త‌ప్ప‌కుండా ఎంట‌ర్ టైన్ చేస్తుందని,ధియేట‌ర్ లో సినిమా పూర్తైన త‌ర్వాత స్టాండింగ్ వోవేష‌న్ ఇస్తార‌ని..రెస్పెక్ట్ తో పాటు క‌లెక్ష‌న్స్ కూడా రాబడుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సీయోట‌ల్ లో మొదలు కానున్న షూటింగ్ ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు జరగనుంది.ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ తో టాలీవుడ్,కోలీవుడ్,హాలీవుడ్ న‌టీన‌టుల‌తో రూపొందుతున్న ఈ మూవీ టీజ‌ర్ ను మేలో గ్రాండ్ గా యు.ఎస్.ఎ లో రిలీజ్ చేయ‌డానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కోసమే అనుష్క సన్నగా అవ్వడానికి ట్రైనింగ్ తీసుకుంది కానీ ఆమె అంతగా తగ్గినట్లు కనిపించలేదు.మరి మూవీ స్టార్ట్ అవడానికి దాదాపు ఇంకో నెల టైం ఉంది కాబట్టి ఆ లోపు మళ్లీ మునపటి అనుష్కని గుర్తు చేస్తుందేమో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *