ముంబై ఇండియన్స్‌ VS కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌

ముంబై ఇండియన్స్‌  VS కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌

ఐపీఎల్‌ 2019 సీజన్‌ మొదలైంది. ఎన్నికల వేడి ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడుస్తోంది. ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి. 2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న ఇరవై నాలుగో మ్యాచ్‌లో ముంబై వేదికగా ఈ రోజు ముంబై ఇండియన్స్‌, కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌లు తలపడున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో మీకోసం మోజో అంచనా వేస్తోంది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రెడిక్షన్‌

మోజో ప్రెడిక్షన్‌…

ముంబై ఇండియన్స్‌ VS కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ … ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. ఈ గ్రౌండ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మొదటి బ్యాటింగ్ చేసిన వారు 170 పరుగులపైనే అవకాశం ఉంది. ఆ లోపు ఉన్న టార్గెట్‌ను కాపాడుకోవడం కష్టంగా ఉంటుంది. రెండు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండటంతో ఎక్కువ స్కోర్లను చూసే అవకాశం ఉంది.

180 దాటితేనే…

టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిచ్‌ స్వభావాన్ని బట్టి పరుగులు బాగానే వస్తాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 170 పరుగులు చేసినా… ప్రత్యర్థి జట్టును అడ్డుకుని విజయం సాధించడం కష్టమే అవుతుంది. 190 పరుగులైతే కానీ పోరాడటానికి సరిపోవు. 180 పరుగులు సాధించినా విజయావకాశాలు ఉంటాయనుకోవడానికి వీలు లేదు. ఇద్దరు కుదురుకున్నా… ఛేజింగ్‌ కష్టమనిపించదు. తొలుత బ్యాటింగ్‌ చేసిన వాళ్లు 190 పైబడి సాధించినా సేఫ్‌ అనుకోవడానికి వీల్లేదు. ఈ రోజు ఆటలో బ్యాట్స్‌మెన్‌దే పైచేయిగా ఉంటుంది. ఛేజింగ్‌ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇరుజట్ల బలాబలాలూ గమనించాక ఈరోజు ముంబైకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *