ముంబై ఇండియన్స్‌ VS చెన్నై సూపర్‌ కింగ్స్‌

ముంబై ఇండియన్స్‌  VS చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఐపీఎల్‌ 2019 సీజన్ ఫైనల్‌ వచ్చేసింది. ఎన్నికల ఫలితాల వేడి ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడిచింది. ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి. 2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ వేదికగా ఈ రోజు ముంబై ఇండియన్స్‌ VS చెన్నై సూపర్‌ కింగ్స్‌తలపడున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో మీకోసం మోజో అంచనా వేస్తోంది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రెడిక్షన్‌

మోజో ప్రెడిక్షన్‌…

ముంబై ఇండియన్స్‌ VS చెన్నై సూపర్‌ కింగ్స్‌ … హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ గ్రౌండ్‌ స్వతహాగా బ్యాలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. పేసర్లకూ, స్పిన్నర్లకూ ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 160 పరుగులను మంచి టార్గెట్‌గానే భావించొచ్చు. 170 పరుగలు చేస్తే దాదాపు విజయం సాధించినట్టుగానే అనుకోవచ్చు. 150 పరుగులు చేసినా, ప్రత్యర్థిని నిలువరించి కాపాడుకునే విధంగా పిచ్‌ సహకరిస్తుంది.

170 కొడితే విజయమే ..

టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిచ్‌ స్వభావాన్ని బట్టి స్లో ట్రాక్‌గా ఉంది. పరుగుల వేగం పెద్దగా ఉండదు. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 170 పరుగులు చేస్తే… విజయం దాదాపు ఖాయమైనట్టే. ఇరు జట్ల బలాబలాలూ పిచ్‌కు అనుగుణంగా అంచనా వేసిన తర్వాత… ముంబై జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *