నా కెరీర్ ముగిసినట్టే.. అదే నా చివరి సినిమా: చిన్మయి

నా కెరీర్ ముగిసినట్టే.. అదే నా చివరి సినిమా: చిన్మయి

మీటూ పేరుతో చిత్ర పరిశ్రమలో, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన ఉద్యమానికి ప్రముఖ గాయిని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మద్దతిచ్చారు. మద్దతివ్వడమే కాదు… తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ రచయితగా పేరుపొందిన వైరముత్తుపై స్వయంగా లైగింక ఆరోపణలు కూడా చేశారు. అప్పటి వరకు నోరు విప్పని చాల మంది చిన్మయి చేసిన ఆరోపణలకు ప్రభావితమై ఉద్యమంలో భాగమయ్యారు. చిన్మయి ఎంట్రీతో  ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిన ‘మీటూ’ ఉద్యమం ఇప్పటికీ… సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తుంది.

లైంగిక ఆరోపణలు…

అయితే, ఆ ఉద్యమమే చిన్మయి భవిష్యత్‌కి శాపంగా మారిందా? అంటే.. తన ట్వీట్స్‌ చూస్తే అవుననే సంకేతాలు వినిపిస్తాయి. తాజాగా తమిళనాడు ఫిలిం డబ్బింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధా రవి తీవ్ర లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆరోపణల చేసిన వారికి మద్దతునిచ్చిన చిన్మయికి తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ విషయం చిన్మయి తన ట్వీటర్ ఖాతా ద్వారా తెలిపారు.

chinmayi

చివరి చిత్రం

గత రెండేళ్లలో తనకు రావలసిన డబ్బింగ్ ఫీజులో 10శాతం ఎందుకు ఇవ్వలేదని ట్వీటర్ వేదికగా ప్రశ్నించారు. తనపై వేటు నిర్ణయం కొనసాగితే త్రిష హీరోయిన్‌గా నటించిన ’96’ చిత్రం తన డబ్బింగ్ కెరీర్‌కి చివరి చిత్రం అవుతుందని తెలిపారు. అయితే ముందస్తు సమాచారం లేకుండానే తనపై వేటు వేశారని చెబుతున్నచిన్మయి మీటూ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించనపుడే తన భవిష్యత్‌ని అంచనా వేశానన్నారు. తనను తొలగించడంపై వరుస ట్వీట్లు చేస్తున్న చిన్మయికి కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే ఇప్పటి వరకూ స్పందిచని తమిళ సినీ పెద్దలు ఎవరికి మద్దతు ప్రకటిస్తారో చూడాల్సి ఉంది. వారి స్పందనపైనే చిన్మయి కెరీర్ ఆధారపడి ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *